యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ డ్యాన్స్ కు కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు సిని సెలబ్రిటీస్ కూడా అభిమానులు ఉంటారు. అలాంటి వారిలో ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంత కూడా చేరింది. సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న సమంత అక్కినేని కోడలిగా మారిన తర్వాత ప్రయోగాత్మక సినిమాలు చేస్తుంది.


ఈ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలతో హిట్ అందుకున్న సమంత ప్రస్తుతం శర్వానంద్ హీరోగా వస్తున్న 96 సినిమాలో నటిస్తుంది. కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 96 మూవీ రీమేక్ గా ఈ సినిమా వస్తుంది. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఆ సినిమా రీమేక్ గా శర్వానంద్, సమంతల జంటగా ఈ సినిమా తెరకెక్కుతుంది.  


రీసెంట్ గా మంచు లక్ష్మి ఓ టాక్ షో మొదలుపెట్టింది. ఫీట్ అప్ విత్ స్టార్స్ తెలుగు షోకి మంచు లక్ష్మి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో భాగంగా సమంత సీక్రెట్స్ కొన్ని బయట పెట్టే ప్రయత్నం చేసింది మంచు లక్ష్మి. ఇక అందులో భాగంగా స్టార్ హీరో ఎన్.టి.ఆర్ గురించి మనసులో మాట చెప్పింది సమంత. ఎన్.టి.ఆర్ డ్యాన్స్ అదరగొట్టేస్తాడని అతని స్పీడ్ ను అందుకోవడం కష్టమని చెప్పుకొచ్చింది.  


ఎన్.టి.ఆర్ తో డ్యాన్స్ చేయడం చాలా కష్టమని.. సెట్ లో తాను అబ్సర్వ్ చేస్తే కేవలం సింగిల్ టేక్ లో ఎలాంటి డ్యాన్స్ మూమెంట్ అయినా చేసేస్తాడు తారక్ అని జూనియర్ ఎన్.టి.ఆర్ పై ప్రశంసల వర్షం కురిపించింది సమంత. రంగస్థలం తర్వాత దాదాపు కమర్షియల్ సినిమాలకు గుడ్ బై చెప్పిందని అనుకుంటుండగా అవకాశం వస్తే తప్పకుండా స్టార్స్ తో నటించేందుకు సై అంటుంది సమంత.  



మరింత సమాచారం తెలుసుకోండి: