బుల్లి తెరపై యాంకర్లలో సుమ తర్వాత వినిపించే పేరు అనసూయ భరద్వాజ్.. జబర్దస్త్ యాంకర్ గా తన హవాను కొసాగిస్తూ వస్తుంది. అలా బాగా ఫెమస్ అయింది అను. ఇకపోతే ఈమె బుల్లి తెరపై చేసిన అల్లరి ఓ రేంజులో ఉండటం వల్ల ఆమెకు సినిమా ఆఫర్లు కూడా వచ్చి పడుతున్నాయి. జబర్దస్త్ షో లో ఈమె వేసే హాట్ డ్రెస్సులు అందరిని ఆకట్టుకున్నాయి. దానితో యూత్ ఫాలోయింగ్ ఈమెకు మాములుగా లేదనే చెప్పాలి. 


ఇది ఇలా ఉండగా అను బేబీ షో లతో పాటుగా సినిమాలలో కూడా నటిస్తుంది. ఈమె రంగస్థలం సినిమాతో నటిగా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చి రంగమ్మత్త గెటప్ లో నటించి అందరి అభిమానాన్ని చూరగొంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో ఆమెకు మంచి పేరు కూడా వచ్చింది. ఇంకేముంది సినిమా హిట్ అయితే ఆ తర్వాత సినిమాలలో నటించడానికి వరుస ఆఫర్లు కూడా బాగా వస్తాయనడం సందేహం లేదు. 


అలా మొదలైనా అను సినీ ప్రస్థానం ఒక్కో మెట్టు ఎదుగుతూ వస్తుంది. నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో కూడా నటించి మంచి పేరును సంపాదించింది.  క్షణం, కథన వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ఆ రెండు సినిమాలు ఆమెకు మంచి పేరును తీసుకు రాలేక పోయాయి. అయినా కూడా ఎం జోరు మాత్రం ఎక్కడ తగ్గలేదు. హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ


కుర్రాళ్లకు నిద్రపట్టనివ్వకుండా చేస్తుంది. దానితో చాలా మంది ఇద్దరు పిల్ల తల్లై ఉండి కూడా ఆ డ్రెస్సులు అవసరమా నికి అని కామెంట్లు పెట్టిన కూడా ఏ మాత్రం పట్టించుకోలేదు.  
విషయానికొస్తే.. బన్నీ, సుక్కు కామినేషన్లో వస్తున్న ఓ సినిమాలో అను ఫుల్ లెంగ్త్ ఉన్న పాత్రలో కనిపించనుంది. సుక్కు దర్శకత్వం అను రంగస్థలం సినిమాలో నటించింది ఆ సినిమా హిట్ అయ్యింది. మళ్ళీ సినిమాలో నటించే అవకాశాన్ని కొట్టేసింది.ఈ సినిమా కూడా హిట్ అవుతుందని అను అసలు పెట్టుకుంది. మరి ఆమె అసలు నెరవేరుతాయి లేదో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: