‘గద్దలకొండ గణేష్’ సక్సస్ తో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన హరీష్ శంకర్ మంచి జోష్ లో ఉంటూ ఈ మూవీ ప్రమోషన్ ను మరింత వేగం పెంచాడు. ఇలాంటి సందర్భంలో ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ టాలీవుడ్ టాప్ హీరోల పై ఈ దర్శకుడు చేసిన వివాదాస్పద కామెంట్స్ టాప్ హీరోల అభిమానులలో చిచ్చు పెడుతున్నాయి.

టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ప్రభాస్ తరువాత నేషనల్ స్టార్ ఇమేజ్ అందుకోగల అర్హత ఒక్క వరుణ్ తేజ్ కు మాత్రమే ఉందని కామెంట్స్ చేసాడు. ఒడ్డు పొడుగు బాగా ఉండి ఆకర్షణీయంగా కనిపించే వరుణ్ తేజ్ లుక్ బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని హరీష్ శంకర్ అభిప్రాయ పడుతున్నాడు. 

అంతేకాదు ‘కేజీ ఎఫ్’ లాంటి బలమైన కథలు వరుణ్ తేజ్ కు బాగా నప్పుతాయి అని కూడ అంటున్నాడు. వాస్తవానికి ప్రభాస్ తరువాత నేషనల్ స్టార్ ఇమేజ్ కోసం జూనియర్ మహేష్ చరణ్ లు ఆరాటపడుతున్నారు. ఈ లిస్టులో తాను కూడ చేరాలని బన్నీ ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో కనీసం ఇప్పటి వరకు 100 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వచ్చిన సినిమా ఒక్కటి కూడ లేని వరుణ్ తేజ్ నేషనల్ స్టార్ ఇమేజ్ కి ఎలా చేరుకుంటాడు అంటూ టాప్ హీరోల అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. 

అంతేకాదు ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మీడియాలో సంచలనం సృష్టించాలి అన్న తపన తప్ప హరీష్ శంకర్ కామెంట్స్ లో ఏమాత్రం వాస్తవం లేదు అంటూ టాప్ హీరోల అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఎదో ఒక వివాదం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేయడం హరీష్ శంకర్ కు ఒక అలవాటుగా మారింది. దానికి కొనసాగింపే ఈ కామెంట్స్ అంటూ మరికొందరు హరీష్ మాటలను లైట్ గా తీసుకుంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి: