'సైరా' ప్రస్తుతం ఈ పేరు ట్రేండింగ్. ఈ సినిమా కోసం మెగా స్టార్ చిరంజీవి ఎంత కష్టపడ్డాడో సినిమా ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. కేవలం హీరోలో అంత కష్టం కనిపిస్తే ఆ సినిమా వెనుక ఎంత కష్టం ఉండాలి. ఈ సినిమా గురించి మనం మహా అంటే ఒకటిన్నర సంవత్సరం నుంచి వింటున్నాం. కానీ ఈ సినిమా రచయితల కష్టం మాత్రం 10 ఏళ్ళ కష్టం. 


ఒక రచయత ఒక కథను అనుకోని రాస్తే.. ఆ కథ సూపర్ హిట్ అవుతుంది అనుకుంటే ఎంతైనా కష్టపడతారు. కథకు సెట్ అయ్యే ప్రతి హీరో దగ్గరకు తిరుగుతాడు. ఓపిక ఉన్న వాళ్ళు సంవత్సరం, రెండు సంవత్సరాలు తిరుగుతారు. ఆ తర్వాత ఇది అవ్వదులే అని పక్కన పెడుతారు. కానీ పరుచూరి బ్రదర్స్ దాదాపు 10 సంవత్సరాలు హీరోల చుట్టూ తిరిగారు. చివరికి చిరంజీవి వద్దకు చేరి డ్రీం ప్రాజెక్ట్ కాస్త ప్రాజెక్ట్ అయ్యింది. 


ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథను సిద్ధం చేసి ఎందరో హీరోల వద్దకు వెళ్లారు కానీ వారు ఆసక్తి చూపలేదు. ఇప్పుడు ఈ సినిమాలో కధానాయకుడు చిరంజీవి అయితే దర్శకుడు సురేందర్ రెడ్డి అయ్యాడు. అయితే ఏ సినిమా అయినా సెన్సార్ అవ్వాల్సిందే. అలా ఈ సినిమా కూడా సెన్సార్ అయ్యింది. సెన్సార్ నుంచి డైరెక్ట్ చిరంజీవికి ఫోన్ చేసి ఎంత అద్భుతం అంటూ ప్రశంసలు అందించారు. సినిమా రచన ఎంత అద్భుతం అయితే ఫోన్ వస్తుంది. దీన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ చిరుకె కాదు పరుచూరి బ్రదర్స్ కి కూడా డ్రీం ప్రాజెక్ట్ అని. మరి విరి 10 ఏళ్ళ కష్టానికి ఫలితం ఎలా ఉంటుందో ఈ అక్టోబర్ 2న తెలుస్తుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: