బిగ్ బాస్ సీజన్ 3 తెలుగులో ప్రారంభమై ఇప్పటికే 9 వారాలు పూర్తి చేసుకొని పదవ వారంలోకి అడుగుపెట్టింది. శనివారం రోజు రాహుల్ సిప్లిగంజ్ ను నాగార్జున ఫేక్ ఎలిమినేషన్ చేయగా హిమజను ఆదివారం రోజు ఎలిమినేట్ చేశారు. సోమవారం రోజు రాహుల్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన హిమజ బిగ్ బాస్ షో గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. 
 
బిగ్ బాస్ సీజన్ 3 మొదటివారంలో ఎలిమినేట్ అయిన హేమ బిగ్ బాస్ షో లో జరిగింది ఒకటైతే మరొకటి చూపిస్తారని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కానీ ఆ తరువాత బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన వారెవరూ బిగ్ బాస్ షో గురించి ఆ విధంగా వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఆదివారం రోజు ఎలిమినేట్ అయిన హిమజ మాత్రం ఎవరూ చేయని రీతిలో వ్యాఖ్యలు చేసింది. నాగార్జున మరలా ఛాన్స్ వస్తే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తావా అని అడిగిన ప్రశ్నకు వెళ్లనని చెప్పిన హిమజ బయటకు వచ్చాక కొన్ని ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది. 
 
బిగ్ బాస్ షోలో జరిగేది ఒకటని కానీ చూపించేది మాత్రం మరొకటని హిమజ వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ నిర్వాహకులు వారికి కావాల్సిన కంటెంట్ ను మాత్రమే టెలికాస్ట్ చేస్తున్నారని చెప్పింది. బిగ్ బాస్ నిర్వాహకులు వారికి నచ్చిన వ్యక్తులను మాత్రమే బిగ్ బాస్ హౌస్ లో ఉంచుతారని మిగతావారిని ఎలిమినేట్ చేసేందుకు నామినేషన్ లోకి తీసుకొనివస్తారని హిమజ చెప్పారు. 
 
బిగ్ బాస్ షోలో ఇలా జరుగుతుందని చెప్పటానికి నా ఎలిమినేషనే ఉదాహరణ అని హిమజ అన్నారు. ఈ వారం ఎలిమినేషన్ కు శ్రీముఖి, బాబా భాస్కర్. రవి కృష్ణ, వరుణ్ సందేశ్ నామినేట్ అయ్యారు. ఈ వారం రవి కృష్ణ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. 



మరింత సమాచారం తెలుసుకోండి: