భారత సినీ పరిశ్రమలోనే కాదు..బుల్లితెరపై ఇప్పటి వరకు రామయణ, మహాభారతం పై ఎన్నో సినిమాలు, సిరియల్స్ వచ్చాయి.  కథ ఒక్కటే అయిన తీసే విధానంలో ఎన్నో మార్పులు చేర్పులతో ఎప్పుడూ ఆకట్టుకుంటునే ఉన్నాయి. ఇలాంటి గొప్ప ఇతిహాసాలను తెరపైకి తీసుకు రావానికి ప్రస్తుతం టెక్నాలజీ వాడుతున్నారు. ఆ మద్య రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి, బాహుబలి2’ వ్యూజువల్ వండర్స్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.    తాజాగా నితీశ్ తివారీ, రవి ఉద్యవార్ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, మధు మంతెన, నమిత్ మల్హోత్రాలతో కలిసి ‘రామాయణ’ అనే భారీ బడ్జెట్ మూవీ నిర్మించనున్న సంగతి తెలిసిందే.

ఈ మూవీని మూడు భాగాలుగా తీయాలనే ఆలోచనలో ఉన్నారట చిత్ర యూనిట్. మొదటి భాగాన్ని 2021 నాటికి ప్రేక్షకులకు అందివ్వాలనుకుంటున్నారు నిర్మాతలు. ఈ మూవీ కోసం దేశవ్యాప్తంగా అన్ని పరిశ్రమల నుండి స్టార్ నటీ నటుల్ని తీసుకుంటున్నారు.  అయితే ఈ మూవీలో రాముడిగా బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ని తీసుకుంటున్నట్లు సమాచారం.  ఇక రావణుడిగా బాహుబలి ప్రభాస్ ని తీసుకోవాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే సీత పాత్రలో మొదట దీపికా పదుకొనె అనుకున్నప్పటికీ ఆమె అందుకు అంగీకరించకపోవడంతో..ఆమె స్థానంలో మరోనటి కోసం అన్వేషన మొదలైంది. 

అయితే సాహూ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధాకపూర్ ని సంప్రదించారని తెలుస్తోంది చిత్ర యూనిట్.  అయితే ఇది మల్టీలాంగ్వేజ్ మూవీ కావడంతో శ్రద్ద రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఏకంగా పది నుంచి పదకుండు కోట్లు వరకు అడిగినట్లు సమాచారం.  అయితే రావణుడి పాత్రకు జూనియర్ ఎన్టీఆర్ బాగుంటాడని.. తారక్ ఒక్కడే ఆ పాత్రకు న్యాయం చేయగలడని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. మరి ఈ హిస్టారికల్ పాత్రలు చేయాలంటే ఒక్క ఎన్టీఆరే గుర్తుకురావడం నిజంగా విశేషమే.



మరింత సమాచారం తెలుసుకోండి: