సాధారణంగా హీరోయిన్లు అంటే  ఏదొక  స్పెషల్ ఉండాలి. కొందరు హీరోయిన్లు డిఫరెంట్ మేకప్ తో అలరిస్తే మరికొందరు మాత్రం విచిత్ర డ్రెస్సుల్లో దర్శనమిచ్చి అందరిని తమ వైపు లాగేసుకుంటారు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లు ఇలా చేసి వాళ్ళ పాపులారిటీని పెంచుకుంటూ పోతారు. ఆడవాళ్లకు ఆడవాళ్లే పోటీ అంటారు కదా అలాగే ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో పరిస్థితి కూడా ఉంది. 


వివరాల్లోకి వెళితే.. మొన్న ముంబైలో జరిగిన ఐఫా అవార్డుల మహోత్సవానికి చాలా మంది సినిమా హీరోలు మరియు హీరోయిన్లు కూడా హాజరయ్యారు.. ఆ అవార్డుల కార్యక్రమానికి చాలా మంది సినీ తారలు వస్తారు. దాదాపు గా సినీ ఇండస్ట్రీ మొత్తం ఆ ఫంక్షన్లో సందడి చేశారు. ఆ నేపథ్యంలో హాజరైన ఒక్కొక్కరు ఒక్కో విదంగా వేషధారణలో వచ్చారు. 


ఇకపోతే ఈ ఫంక్షన్ కు బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే మాత్రం ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. అంతేకాదండోయి.. ఆమె డ్రెస్ చూడటానికి కొత్తగా ఉన్న చాలా పొడవుగా ఉంది.. ఆమె స్టేజ్ పైకి వెళ్ళినప్పుడు తన భర్త రణవీర్ సింగ్ ఆమె డ్రెస్ ను పట్టుకొని వెల్తూ సిగ్గుతో మురిసిపోయారు. మరో విషయమేంటంటే ఆ అవార్డుల ఫంక్షన్ కు హాజరైన కండల వీరుడు సల్మాన్ ఆమె డ్రెస్ చూసి ఇదేంటమ్మా ఇది డ్రెస్స లేక కర్టెనా ఇలా ఉంది అన్నట్లు  ఆమె స్టేజ్ పై మాట్లాడుతుంటే మరో వైపు అతను వెల్తూ దీపికా పై ఓ లుక్ వేసాడు. 


ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సల్మాన్ ను ఫోకస్ చేస్తూ మీడియా కూడా నవ్వుకుంది. ఇకపోతే పద్మావత్ సినిమాలో అద్భుతమైన నటనను  కనబరిచినందుకు  గాను దీపికాకు, తన భర్త రణవీర్ సింగ్ కు అవార్డులు తీసుకున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: