‘సైరా’ మ్యానియాకు భయపడిపోయి ఈ వారం ఒక్క మిడిల్ రేంజ్ సినిమా కూడ విడుదల కావడం లేదు. కానీ ‘రాయల సీమ లవ్ స్టోరీ’ ‘బిజె’ ‘ఆమె చక్కని సీత’ ‘నిన్ను తలచి’ ‘మిర్రర్’ లాంటి చిన్న సినిమాలు ఈవారం విడుదల అవుతున్నాయి. అయితే ఈ  సినిమాలలో ఏ ఒక్క సినిమాకు అయినా రెండవ వారం పోస్టర్ పడుతుందా అన్నది సందేహం. 

ఇలాంటి పరిస్థితులలో తీసుకున్న ఒక అనూహ్య నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. పూరీకి కోట్లు కురిపించి తిరిగి అతడిని ట్రాక్ లోకి తీసుకు వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీని ఈ వారం మళ్ళీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఈనెల 28వ తారీఖున పూరీ జగన్నాథ్ పుట్టినరోజు కావడంతో ఈ రీ రిలీజ్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఈ వారం విడుదల అవుతున్న చిన్న సినిమాలలో ఏ చిన్న సినిమాకు సరైన క్రేజ్ లేకపోవడంతో ‘సైరా’ విడుదల అయ్యేదాకా ఈ వారంతం సినిమాలు చూసే ప్రేక్షకులు మళ్ళీ తన ‘ఇస్మార్ట్ శంకర్’ ను చూస్తారు అనే వ్యూహంతో పూరీ ఈ ఎత్తుగడ వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మన తెలుగు రాష్ట్రాలలో ఈ మూవీ రీ రిలీజ్ కోసం కొన్ని ధియేటర్లు బుక్ చేసే పనిలో పూరీ టీమ్ బిజీగా ఉన్నట్లు టాక్. 

అయితే ‘సైరా’ మ్యానియాతో అందరూ ఆ సినిమా రిలీజ్ గురించి ఎదురు చూస్తున్న పరిస్థితులలో ఈ శుక్రు వారం విడుదల కాబోయే ఈ చిన్న సినిమాల గురించి అదేవిధంగా పూరీ ‘ఇస్మార్ట్ శంకర్’ గురించి ఎవరైనా పట్టించుకుంటారా అన్నదే ప్రశ్న. వాస్తవానికి పూరీ జగన్నాథ్ చిరంజీవి 150 సినిమా తీసే అవకాశం వస్తుంది అని భావించాడు. అప్పట్లో పూరీకి అవకాశం రాకపోయినా ఇలా ‘సైరా’ కు పైలెట్ గా తన ‘ఇస్మార్ట్ శంకర్’ ను మార్చాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: