బాలీవుడ్ లో టాప్ హీరోలలో ఒకరు రొమాంటిక్ స్టార్ హృతిక్ రోషన్.. క్రిష్, ధూమ్ వంటి సినిమాలలో నటించిన ఈ హాట్ హీరో ఏది చేసిన కూడా అది హాట్ న్యూస్ అవుతుంది. ఎన్నో సినిమాలలో నటించిన హృతిక్ కు అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే.. అయితే హృతిక్ తాజాగా ఓ ఇంటర్వ్యూ కి అటెండ్ అయ్యాడు అక్కడ హృతిక్ తన గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 


ఇంతకీ ఆయనేమన్నారంటే.. తన మొదటి సినిమా రిలీజ్ అయ్యాక అతనికి అమ్మాయిల ఫాలోయింగ్ బాగా పెరిగింది. దానితో చాలా మంది అమ్మాయిలు అతనికి ప్రపోజల్స్ వచ్చాయని వెల్లడించారు. 2000లో విడుదలైన ‘కహోనా ప్యార్‌ హై’ చిత్రంతో వెండితెరకు అతడు పరిచయమయ్యాడు. ఆ సినిమాలో ఇతగాడిని చుసిన అమ్మాయిలు దాదాపుగా 30 వేల ప్రపోజల్స్ పంపారట. 


మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో హృతిక్ మరియు ఆ సినిమాలో నటించిన హీరోయిన్ అమీషా పటేల్ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. ఆ సినిమాకు రాకేష్ రోషన్ దర్శత్వం వహించారు. అయన డైరెక్షన్ ఎప్పటికి టాప్ లో ఉంటుంది. అందుకే ఆ సినిమా హిట్ అయ్యింది అంటూ రాకేష్ పై ప్రశంశల వర్షం కురిపించాడు. 


ఇకపోతే ఆ సినిమా ఒక సంవత్సరంలో దాదాపు 92 పురస్కారాలను అందుకొని గిన్నిస్ బుక్ లో కూడా చోటు దక్కిచుకుంది. గత  20 ఏళ్లలో బాలీవుడ్‌లో వచ్చిన  సినిమాల్లో బెస్ట్‌గా నిలిచింది. ప్రస్తుతం హృతిక్ రోషన్ వార్ చిత్రంలో నటిస్తున్నారు. ఆ సినిమా విడుదల కాబోతుంది. యాక్షన్‌ కోణంలో రూపొందిన ఈ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌, వాణి కపూర్‌ ప్రత్యేకపాత్రల్లో నటించారు.రొమాంటిక్ హీరో యాక్షన్ సినిమా ఎలా ఉండబోతుందో చూద్దాం..


మరింత సమాచారం తెలుసుకోండి: