విభిన్నమైన పాత్రలను చేస్తూ వెర్సటైల్ యాక్టర్ గా పేరుతెచ్చుకున్న ఆది పినిశెట్టి హీరోగా అథ్లెటిక్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యంలో రూపొందుతోన్న చిత్రం `క్లాప్‌`.  ఐబీ కార్తికేయన్ సమర్పణలో ప్రిత్వి ఆదిత్య  దర్శకుడిగా  శ్రీ షిరిడీసాయి మూవీస్‌, బిగ్ ప్రింట్ పిక్చర్స్, సర్వన్త్ రామ్ క్రియేషన్స్ బ్యానర్లపై రామాంజ‌నేయులు జ‌వ్వాజి, యం .రాజశేఖర్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్ భాషల్లోతెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో రెండు విభిన్నమైన క్యారెక్టర్స్‌లో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఆది పినిశెట్టి సరసన ఆకాంక్ష సింగ్ కథానాయికగా న‌టిస్తుంది.


ప్ర‌స్తుతం ఈ సినిమాలోని ఓ పాట‌ను హైద‌రాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో చిత్రీక‌రిస్తున్నారు. దినేశ్ మాస్ట‌ర్ నృత్య రీతులు స‌మ‌కూరుస్తున్న ఈ స్పెష్‌ల్ సాంగ్‌లో మోనాల్ గ‌జ్జ‌ర్ న‌టిస్తున్నారు. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతాన్ని అందిస్తున్నారు. నాజ‌ర్‌, ప్ర‌కాశ్‌రాజ్‌, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ధారులు.
తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూజాకార్యక్రమాల అనంతరం చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి తెలుగు వెర్షన్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా క్లాప్ నిచ్చారు. తమిళ వెర్షన్‌కు హీరో నాని క్లాప్ నిచ్చారు. నిర్మాత అల్లు అరవింద్ కెమెరా స్విఛాన్ చేశారు. స్క్రిప్ట్‌ను బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, బొమ్మరిల్లు భాస్కర్ అందజేశారు. అనంతరం ఆది పినిశెట్టి మాట్లాడుతూ హృదయాన్ని కదిలించే చిత్రమిది. క్రీడా నేపథ్యంలో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి. వాటన్నింటికి భిన్నంగా సాగుతుంది. భిన్నమైన రెండు పార్శాలున్న పాత్రలో నటిస్తున్నాను. ప్రతిభ వున్న నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తున్నారు అన్నారు.


ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, నాజర్, ప్రకాష్ రాజ్, క్రిష కురుప్, బ్రహ్మాజీ, ముండాసు పట్టి రాందాసు, మిమే గోపి, సూర్య, మీనా, వాసు  తదితరులు న‌టిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మాస్ట్రో ఇళయరాజా, డిఒపి: ప్రవీణ్ కుమార్,  ఆర్ట్: వైర బాలన్, ఎడిటర్: రాగుల్, ఫైట్స్ : శరవణన్, సమర్పణ: ఐబీ కార్తికేయ‌న్‌, కో-ప్రొడ్యూసర్స్: ఫై.ప్రభ ప్రేమ్,జి.మనోజ్, జి.శ్రీహర్, నిర్మాతలు;  రామాంజనేయులు జ‌వ్వాజి, యం. రాజశేఖర్ రెడ్డి, దర్శకత్వం; ప‌్రిత్వి ఆదిత్య.


మరింత సమాచారం తెలుసుకోండి: