కొందరు నవ్వతూ జీవిస్తారు.మరికొందరు నవ్వించడం కోసం జీవిస్తారు.బ్రతుకులోకి వెలుగు రావడం వేరు.ఆవెలుగులో నలుగురిని నడిపించడం వేరు.అది వేణుమాధవ్‌కు అక్షరాల సరిపోతుంది.ఏ సమయంలో ఈ పుడమిపై జన్మించాడో అప్పుడు ధరణికూడ ఆనందంతో అతనికి ఆహ్వానం పలికి వుంటుంది.ఎందుకంటే అతను సినిమా అనే వనంలో మహావృక్షంగా ఎదుగుతాడని తనకు తెలుసుకదా.ఇక అందుకే అతనికి కన్నవాళ్లు వేణు అని పేరు పెట్టినట్లున్నారు.కృష్ణుడి చేతిలో మధుర స్వరాలు పలికించే పిల్లనగ్రోవి,వేణుమాధవ్‌లా మారి సినీ ప్రేక్షకలోంలో నవ్వుల దరువు మోగిస్తూ,నటనతో నలుగురిని మెప్పిస్తూ నిరంతర ప్రయాణం చేసి ఇప్పుడు అలసిపోయినట్లు వుంది తన సమయం ఆసన్నమైందని నిష్క్రమించింది..



ఇతనితో చేసిన ప్రతి హీరో వేణుని అభిమానించకుండా ఉండలేడు.ఎందుకంటే హస్యం అపహస్యం కాకుండా,తనదైన టైమింగ్‌తో నవ్వుల తారలను తళుక్కున మెరిపించే వాడు.హస్యంలో తనదంటూ ఓ స్టాంప్‌ను ముద్రించుకున్నాడు.ఇక అప్పటి హోమ్ సినిమాటోగ్రఫీ మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి, పరిచయస్తుల సహకారంతో వేణుమాధవ్ సినీ రంగ ప్రవేశం చేశారు.1996లో సంప్రదాయం మూవీలో తొలి అవకాశం వచ్చింది.తరువాత ఎన్నో మూవీల్లో కమెడియన్ గా ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించారు.స్టార్ కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు.ఇలా 2016 డాక్టర్ పరమానందయ్య స్టూడెంట్స్ మూవీ వరకు చిత్ర హాస్య జైత్రయాత్ర సాగింది.600 కు పైగా సినిమాల్లో హాస్యం పండించి అలరించారు.



గోకులంలో సీత,మాస్టర్,సుస్వాగతం,తొలిప్రేమ,తమ్ముడు,ఆది,దిల్, సింహాద్రి,ఆర్య,శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్. మాస్, బృందావనం,సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు, రుద్రమదేవి తదితర చిత్రాల్లో కడుపు పగిలేలా హాస్యం పండించారు.తనను వెండితెరకు పరిచయం చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలోనే హంగామా సినిమాలో అలీతో కలిసి హీరోగా పరిచయం అయ్యారు.తరువాత భూకైలాష్‌,ప్రేమాభిషేకం సినిమాల్లో హీరోగా నటించారు.అంతేకాదు ప్రేమాభిషేకం సినిమాను తానే స్వయంగా నిర్మించారు.చివరగా రుద్రమదేవి సినిమాలో నటించిన వేణు మాధవ్‌ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.ఇక ఆయన సిని జీవనయానంలో అనేక మంది సినీ,రాజకీయ ప్రముఖులతో ఎంతో సన్నిహితంగా కలిసిపోయారు.


మరింత సమాచారం తెలుసుకోండి: