సినిమా ఇండస్ట్రీ అంటే ఓ రంగుల ప్రపంచం.ఇక్కడ కంటికి కనిపించేదంతా నిజం కాదు.అలాగని అబద్ధం కాదు. నిజమనుకున్నది,అబద్ధంలా కనిపిస్తుంది.అబద్ధం అనుకున్నది నిజంలా వినిపిస్తుంది.ఇక్కడ జరిగే ప్రతి పరిచయం ఓ అబద్ధం.కాని ఆ అబద్ధం వెనుక కొంచెం నిజం అప్పుడప్పుడు కనిపిస్తుంది.ఇలా ఎందుకు అన్నానంటే ఒక సినిమాలో నటించే వారందరు ఆ సినిమా షూటింగ్ ముగిసాక,తలోదారిలో వెళ్లుతారు.మరో సినిమాలో బిజి అవ్వుతారు కాని అందులో కొద్దిమంది మాత్రమే మరచిపోని బందాలను కలుపుకుని జీవిస్తారు.అలా వేణుమాధవ్ తనకంటు తనవాళ్లు అనే కొందరిని తన జీవితంలో సంపాధించుకున్నారు.ఈ రోజు ఆయన మరణంతో వాళ్లంతా ఎంత క్షోభను అనుభవిస్తుంటారో చూసే వాళ్లకు తెలియదు.



ఇక వేణు గారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారిలో షకీల ఒకరు.వేణు గారు యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుది శ్వాస విడిచిన సందర్భంగా .ఆయనతో అనుబంధం ఉన్నవారు ఆ జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలో గతంలో షకీల ఓ ఇంటర్వ్యూలో వేణుమాధవ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి.షకీల చెప్పిన వివరాల ప్రకారం..ఒక సినిమా షూటింగ్ నిమిత్తం తాను,వేణుమాధవ్,రఘుబాబు, బ్రహ్మానందం ఒక హోటల్లో ఉన్నామని,ఆ సమయంలో వేణు,మిగతా చిత్ర యూనిట్ సభ్యులు జోక్స్ చెప్పుకుంటూ, సరదాగా మాట్లాడుకుంటూ తన గదిలోనే ఉన్నారని.వాళ్లు చేసిన అల్లరికి తన గది చిందరవందరగా మారిందని..దాంతో ఆ రాత్రి వేణు గదిలో పడుకోవాలనుకుంటున్నానని అడిగితే ఎలాంటి సంకోచం లేకుండా నిర్భయంగా పడుకోవచ్చు అని అన్నారు..



ఇక వేణు గదిలో ఇద్దరం ఒకే బెడ్‌పై పడుకున్నామని..తమ అసిస్టెంట్ కొద్ది దూరంలో సోఫాలో పడుకున్నాడని చెప్పారు. కాసేపటికి వేణు నన్ను భయపెట్టాలనిన్ హస్కీ వాయిస్‌తో.నేనో విషయం అడగనా..అని అనే సరికి తాను చాలా భయపడి పోయానని.ఏం అడుగుతాడోనని టెన్షన్ పడ్డట్టు చెప్పారు.సరే అడుగుతాను..నువ్వు ఫీలవ్వకుండా ఒప్పుకుంటావా..అనేసరికి టెన్షన్ ఇంకా ఎక్కువైపోయిందని..ఏదో ఫ్రెండ్‌ మంచివాడని వస్తే ఇలా చేస్తున్నాడే అని బాధపడ్డానని అన్నారు. చివరకు ఏంట్రా నీ ప్రాబ్లమ్ అని అడిగేసరికి..తనకు,నాకు మధ్య పిల్లోస్ పెడుతూ నాకు పెళ్లయి ఇద్దరు బిడ్డలు ఉన్నారని తెలుసు కదా..ఒకవేళ నిద్రలో నువ్వు నీ కాలు గనుక నాపై వేస్తే అంతే సంగతి.కాబట్టి నువ్వు కాలు వేసుకోవాలనుకుంటే..ఆ పిల్లోపై వేసుకో అంటూ కూల్ గా  చెప్పాడని.ఆ సమయంలో వేణుని చూసి ఇదీ ఫ్రెండ్‌షిప్ అంటే అనుకున్నానని చెప్పారు షకీల... 



మరింత సమాచారం తెలుసుకోండి: