మాజీ పోర్న్ స్టార్ ,బాలీవుడ్  ప్రముఖ నటి  సన్నీ లియోన్  కామసూత్ర  అనే వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించిందని సమాచారం. వాత్సాయన  రాసిన కామసూత్ర అనే  గ్రంథంను ఆధారంగా చేసుకొని బాలాజీ టెలీఫిల్మ్స్ సృష్టికర్త  ఏక్తా కపూర్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించనుంది.



ఇక సన్నీ లియోన్  వెబ్ సిరీస్ లో నటించడం ఇది మొదటిసారి  కాదు.  ఇంతకుముందు సన్నీ'కరంజిత్ కౌర్ ది అన్ టోల్డ్ స్టోరీ అఫ్ సన్నీ లియోన్'   అనే వెబ్ సిరీస్ లో నటించింది.  ఈ సిరీస్ సన్నీ నిజ జీవిత కథ తో రూపొందించబడింది.  ఓ మధ్య తరగతి అమ్మాయి , పోర్న్ స్టార్ గా ఎందుకు మారాల్సి వచ్చింది.  ఆతరువాత  పోర్న్ స్టార్ నుండి ఇప్పుడు సక్సెస్ ఫుల్ నటిగా ఎలా కొనసాగుందో  ఈ  వెబ్ సిరీస్ లో వివరించారు.   జీ 5 లో ఈ వెబ్ సిరీస్ ను వీక్షించవచ్చు. కాగా సన్నీ ఇంతకుముందు  ఏక్తా కపూర్ నిర్మించిన  రాగిణి ఏంఏం ఎస్ 2 అనే చిత్రంలో నటించింది.  2104 లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అయ్యింది.



ఇక ఇప్పుడు కూడా కామసూత్ర  వెబ్ సిరీస్ కు సన్నీ అయితేనే న్యాయం చేస్తుందని  నమ్మి  ఆమెను ఒప్పించిందట ఏక్తా కపూర్.  ఈ వెబ్ సిరీస్ ను   ఏ ఎల్ టి  బాలాజీ యాప్ లో విడుదలచేయనున్నారు.  13 వ శతాబ్దంలో రాజులకు ఉంపుడుగత్తెగా పనిచేసే రాజస్థాన్ లోని గోలీ వర్గానికి చెందిన మహిళల గాథలను  ఈ వెబ్ సిరీస్ ద్వారా చూపెట్టనున్నారు.  త్వరలోనే ఈ వెబ్ సిరీస్ గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: