మెగాస్టార్ చిరంజీవి నటించిన 151వ సినిమా సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో ఈ సినిమా తెరకెక్కింది. అయితే ఈ సినిమా కథను తయారు చేసి 10 ఏళ్లుగా హీరో కోసం వెతుకుతున్నామని చెప్పారు పరుచూరి బ్రదర్స్.


అయితే చిరంజీవి చేస్తానని హామీ ఇచ్చినా అది ఇప్పటికి గాని కుదరలేదు. అయితే సైరా సినిమా కథ వారు సిద్ధం చేసినట్టుగా చెప్పుకొచ్చారు పరుచూరి వెంకటేశ్వర రావు. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సురేందర్ రెడ్డి మాత్రం ఈ సినిమా కథ సొంతంగా రాసుకున్నట్టుగా చెప్పుకొచ్చాడు. నరసింహా రెడ్డి జీవిత చరిత్ర కోసం చాలా పుస్తకాలు.. అక్కడకు వెళ్లి అక్కడ జనాల చెప్పిన విషయాల ద్వారా కథ సిద్ధం చేశామని చెప్పాడు.        


కథ విషయంలో పరుచూరి బ్రదర్స్ కు క్రెడిట్ ఇవ్వకుండా డైరక్టర్ సురేందర్ రెడ్డి తనే సొంతంగా సైరా కథ సిద్ధం చేసినట్టు చెబుతున్నాడు. అంతేకాదు పరుచూరి బ్రదర్స్ సైరా విషయంలో దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. సినిమాలో డైలాగ్స్ కూడా సాయి మాధవ్ బుర్రానే రాశాడు. కథ విషయంలోనే కాదు డైలాగ్స్ విషయంలో కూడా ఆ సీనియర్ రైటర్స్ కు నిరాశ తప్పలేదు.  


అయితే ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న మరో వర్షన్ ఏంటంటే పరుచూరి సోదరులు సిద్ధం చేసిన కథనే ఇంకొంత క్లారిటీగా సురేందర్ రెడ్డి కొంత రీసెర్చ్ చేసి ఈ కథ సిద్ధం చేశాడట. అందుకే రచనా సహకారం కింద పరుచూరి బ్రదర్స్ పేరు వేయాలని నిర్ణయించుకున్నారు. రీసెంట్ గా సెన్సార్ పూర్తి చేసుకున్న సైరా సినిమా సూపర్ హిట్ పక్కా అని అంటున్నారు. అక్టోబర్ 2న తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: