కన్నడ నటుడు యాష్ హీరోగా హోంబలె సంస్థపై గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన భారీ యాక్షన్ సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1. యాష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కన్నడతో పాటు పలు ఇతర భారతీయ భాషల్లో కూడా రిలీజ్ అయి, అతి పెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. మొదటి రోజు నుండే సూపర్ హిట్ టాక్ ని సంపాదించిన ఈ సినిమా, తెలుగులో కూడా అత్యద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే చాప్టర్ 1లో కనపడీ కనపడకుండా అలా చిన్న మెరుపు మెరిసిన అధీరా పాత్ర, ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న చాప్టర్ 2లో ఎంతో ముఖ్యమైనదని తెలుస్తోంది. 

అయితే ఆ పాత్రకు గాను పలువురిని అనుకున్న తరువాత, చివరికి ఆ సినిమా టీమ్ మొత్తం కలిసి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ని ఎంపిక చేసారు. అంతటి పవర్ఫుల్ క్యారెక్టర్ కి ఖల్ నాయక్ గా అలరించిన సంజయ్ దత్ అయితేనే న్యాయం చేయగలరని భావించి, దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా ఎంతో కష్టపడి ఆయనను ఒప్పించడం జరిగిందట. అయితే నేడు కొన్ని సినిమా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, ఈ చాప్టర్ 2లో ముఖ్యమైన క్యారెక్టరైన అధీరా, మెయిన్ విలన్ కాదని అంటున్నారు. 

నిజానికి సినిమా మొదలైన దగ్గర్నుండి మనకు అధీరానే మెయిన్ విలన్ అన్నట్లుగా చూపిస్తారని, అయితే సినిమా ప్రీ క్లైమాక్స్ కి చేరుకోగానే ఎవ్వరూ ఊహించని విధంగా అతి పెద్ద మలుపు తిరుగుతుందని, దానితో మెయిన్ విలన్ ఎవరనేది తెలుస్తుందని సమాచారం. అయితే రెండు రోజల నుండి పలు మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఈ వార్త బయటకు రాగానే చాప్టర్ 2 పై ప్రేక్షకుల్లో మరింత విపరీతమైన ఆసక్తి, అంచనాలు పెరిగాయి. మరి వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎంత మేర విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: