సినిమా ప్రపంచంలో స్టార్ హీరోల క్రేజ్, రేంజ్ మరియు మార్కెట్ లెవెల్స్ వేరు అనే చెప్పాలి. నిజానికి అటువంటి స్టార్స్ రేంజ్ ని మిగతా నటులు అందుకోవడం ఒక రకంగా అంత సులువు కాదనే చెప్పాలి. ఇకపోతే కేవలం స్టార్ హీరోలకు మాత్రమే కాక అక్కడక్కడ కొందరు తారలకు కూడా విపరీతమైన క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆ విధంగా యూత్ లో అలానే రసిక ప్రియుల్లో విపరీతమైన క్రేజ్ సంపాదించిన శృంగార తార సన్నీలియోన్. ఆమె ఫలానా సినిమాలో ఉందని తెలిస్తే చాలు, థియేటర్స్ కు పరుగులెత్తే ఫ్యాన్స్ ఆమెకు ఎందరో ఉన్నారు. 

ఇక ఇటీవల వచ్చిన కొన్ని బాలీవుడ్ సినిమాల్లో అక్కడక్కడా తళుక్కుమన్న సన్నీ లియోన్, కొన్నాళ్ల క్రితం వీరమదేవి అనే హిస్టారికల్ క్యారెక్టర్ లో కూడా నటించి మెప్పించింది. ఇకపోతే ఆమె అతి త్వరలో ఏకంగా కామసూత్ర అనే శృంగార భరిత వెబ్ సిరీస్ లో నటించనున్నట్లు బాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రముఖ నిర్మాత ఏక్తా కపూర్, భారీ ఖర్చుతో నిర్మించనున్న ఈ కథ, 13వ శతాబ్దం నేపథ్యంలో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక దీనిని, తన ఆల్ట్ బాలాజీ బ్యానర్ పైనే నిర్మించనున్నారట ఏక్తా. సినిమాలతో పోలిస్తే నేటి కాలంలో వెబ్ సిరీస్ లకు అత్యంత ఆదరణ ఉంటోందని, 

అదీకాక వీటికి సెన్సార్ సమస్యలు కూడా పెద్దగా ఉండవని భావించి, సిరీస్ మొత్తాన్ని ఎంతో నాచురల్ గా తీయాలని చూస్తున్నారట. జిస్మ్ 2 తో బాలీవుడ్ కి ప్రవేశించి, అక్కడ విపరీతంగా క్రేజ్ మరియు ఫాలోయింగ్ సంపాదించిన సన్నీ, అనతి కాలంలోనే ఎంతో ఎత్తుకు ఎదిగింది. మరి తొలిసారి వెబ్ మీడియాలో ఆమె చేసే తొలి ప్రయత్నం ఇంకెన్ని సంచలనాలకు నెలవు అవుతుందో చూడాలి. అయితే ఈ వార్త బయటకు వచ్చిన వెంటనే సన్నీ ఫ్యాన్స్ కొందరు, పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో అమితానందాన్ని వ్యక్తం చేస్తూ తమ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియపరుస్తున్నారు.....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: