గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత  వ్యాధితో బాధపడుతున్న  హాస్య నటుడు వేణు మాధవ్ బుధవారం  మధ్యహ్నం  తుది శ్వాస విడిచారు.ఆయన మరణ వార్త విని తెలుగు సినీ ప్రపంచం శోకసంద్రంలో మునిగిపోయింది.. రేపు మధ్యహ్నం 12-1.30 వరకు మా అసోషియేషన్  వద్ద  ఆయన  పార్థివ దేహాన్ని ఉంచుతామని సినీ నటుడు అలీ తెలియజేశాడు.

జనసేన పార్టి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వేణు మాధవ్ మృతి పట్ల సంతాపం తెయజేస్తూ  మీడియాకు ప్రకటనను విడుదల చేశారు.

పవన్ కళ్యాణ్ మీడియాకి ఇచ్చిన ప్రకటనలో వేణు మాధవ్ గురించి ఈ విధంగా చెప్పాడు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న వేణు మాధవ్‌ కోలుకుంటారు అనుకున్నాను. నటుడిగా ఎంతో భవిష్యత్‌ ఉన్న ఆయన మరణించడం బాధాకరం. ‘గోకులంలో సీత’ నుంచి నాతో కలిసి పలు చిత్రాల్లో నటించారు.  వేణు మాధవ్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను’’ అని ఆయన ప్రకటన విడుదల చేశారు.

వేణు మాధవ్ పవన్ కళ్యాణ్ కలిసి గోకులంలో సీత, తోలిప్రేమ, గుడుంబా శంకర్,అన్నవరం, బంగారం,తమ్ముడు సినిమాల్లో నటించారు. తోలిప్రేమ. అన్నవరం సినిమాల్లో వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. హస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా వ్యవహరించిన షో కు గెస్ట్ గా వచ్చిన  వేణు మాధవ్  ఆయనకు పవన్ కళ్యాణ్ కి మధ్యగల సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నాకు 10 ఎకారల పొలం ఉంది అందులో వ్యవసాయం చేస్తాను.పవన్ కళ్యాణ్ కి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం నా పొలంలో పండిన పంట నుండి ఒక బస్తా బియ్యం పవన్ కళ్యాణ్ కు పంపిస్తాను. ఆయన ప్రతి సంవత్సరం ఆయన తోటలో పండే మామిడి పండ్లను నాకు పంపిస్తాడు. ఇది మా మధ్య ఒప్పదం ఒక సారి నేను బియ్యం తో పాటుగా పెసర్లు, కందులు పత్తి పంపాను. ఆయన నా మీద సీరియస్ అయ్యారు.నేను మామిడి పండ్లు మాత్రమే పండిస్తున్నా నువ్వు ఇన్ని రకాలు పండిస్తున్నావని నా దగ్గర కటింగ్ ఇవ్వడానికి ఇన్ని పంపావా అని   సరదాకు సీరియస్ అయ్యారు అని వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ గురించి చెప్పారు.

అలాగే  సీనియర్ ఎన్ టి రామారావు గారి దగ్గర పని చేసే రోజుల్లో ఒక రోజు రాత్రి లైట్ ఆఫ్ చేయడం  మరిచిపోయాను. ఉదయం వచ్చిన ఆయన వెలుగుతున్న  లైట్ ని చూసారు. అప్పుడు నన్ను పిలిచి  నాలుగు చీవాట్లు పెట్టారు. .  పదిహేను నిమిషాల తరువాత నన్ను మళ్ళీ    పిలిచారు.భయంతో లోపలికి వెళ్ళిన నాకు నేతి దోశలు పెట్టి మళ్ళీ  ఇలాంటి తప్పు చేయవద్దని మందలించారు అని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: