అందమా అందమా అందమంటే తమన్నాదే  నమ్మా.. అందాల నిధిని తనలో దాచుకున్న ఈ అమ్మడు తెలుగు తో పాటుగా, పలు ఇండస్ట్రీ సినిమాలలో నటిస్తూ వస్తుంది. ఎంత అందంగా ఉంటుందో, అంతే చక్కగా పాత్రలో లీనమై చేయడం ఆమె స్టైల్. తెలుగు హీరోలంతా కూడా ఈమెను ముద్దుగా మిల్క్ బ్యూటీ ,తెల్లతోలు పిల్ల అని పిలుస్తుంటారు. అది నిజమే అనుకోండి ఎందుకంటే ఆమె అందం అలాంటిది. 



ఎన్ని సక్సెస్ సినిమాలలో నటించినా, ఇప్పటివరకు నటించిన వాటిలో ఎన్ని ఫెయిల్యూర్స్ ఎదురైనా కూడా ఎక్కడా వెనకడుగు వెయ్యలేదు. వరుస సినిమాలలో నటిస్తూ వస్తుంది. కొత్త హీరోయిన్లు
ఎందరొచ్చినా కూడా ఏ మాత్రం తమన్నా జోరు తగ్గలేదు. అందుకే దట్ ఈజ్ తమ్ము బేబీ.. అందుకేమో బాహుబలి, సైరా వంటి పెద్ద సినిమాలలో పెద్ద హీరోలకు పోటీగా నటిస్తుంది. 



ఇకపోతే ఈమె జీవిత విశేషాలకొస్తే.. తమ్ము పుట్టింది పెరిగింది అంతా ముంబైలోనే.. చిన్నప్పటి  నుండే నటన మీద మక్కువతో ఈ బ్యూటీ ఎన్ని స్టేజ్ పెర్ఫార్మెన్స్ లను ఇస్తూ వచ్చింది. అలా ఓ డైరెక్టర్ ఆమె నటనను చూసి నా సినిమాలో చేస్తావా అని అడిగాడు. హిందులో తన తోలి సినిమా చాంద్ షా రోషన్ చెహ్రా  ఈ సినిమాతో సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది మిల్క్ బ్యూటీ. తెలుగులో 'శ్రీ' సినిమాలో మొదటగా నటించింది. 


ఆ తర్వాత హ్యాపీ డేస్, 100% లవ్ వంటి సినిమాలలో నటించి సక్సెస్ హీరోయిన్ గా దూసుకుపోయింది. అలా ఆమె ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన తమ్ము బాహుబలి, సైరా వంటి ప్రపంచ స్థాయి సినిమాలలో నటించింది. ఎన్ని సినిమాలలో కనిపించినా కూడా ఈ బ్యూటీ ఎప్పుడు ఫిట్ నెస్ విషయంలో శ్రద్ద తీసుకుంటూ వస్తుంది. అంతేకాదండోయి.. ఫుడ్ కూడా బాగానే తింటుందట.. ఆమెకి చాకోలెట్లు అంటే చాలా ఇష్టమట. అందుకే ఎప్పుడు బ్యాగ్ లో చాకోలెట్స్ క్యారీ చేసిందట.. ఏది ఏమైనా కూడా ఈ మిల్క్ బ్యూటీ అందాలను ఆరబోతలో వెనకడుగు వెయ్యదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: