బిగ్ బాస్ లో ఈ వారం నామినేషన్స్ లో మొత్తం నలుగురు సభ్యులు ఉన్నారు. వరుణ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రవి క్రిష్ణలలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. నామినేషన్స్ లో ఉన్న వారందరూ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ కావడం వల్ల టఫ్ కాంపిటీషన్ ఉండనుంది. వరుణ్ తనకి తానుగానే కావాలని నామినేషన్స్ లో ఉన్నాడు. నామినేషన్స్ లోకి రాక చాలా రోజులు అవుతున్న కారణంగా అతను ఈ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తుంది. 


ఐతే వరుణ్ హీరో కాబట్టి అతనికున్న ఫాలోయింగ్ ఆధారంగా వరుణ్ సేవ్ అవుతాడని అనిపిస్తుంది. అయితే  నిన్నటి ఎపిసోడ్ లో రాహుల్ ,వరుణ్ ల మధ్య ఎంత పెద్ద గొడవ జరిగింది. కానీ ఈ గొడవలో ఇద్దరి తప్పులున్న కారణంగా ఎవరికి పెద్దగా ఎఫెక్ట్ పడే అవకాశం కనిపించట్లేదు. కాకపోతే రాహుల్ నామినేషన్స్ లో లేడు కాబట్టి అతని అభిమానులు వరుణ్ కి కాకుండా వేరే వాళ్లకి ఓట్లేసే పరిస్థితి అయితే ఏర్పడింది. కానీ అది కూడా వరుణ్ మీద ప్రభావం చూపకపోవచ్చు.


ఇకపోతే శ్రీముఖి విషయానికి వస్తే, హౌస్ లో ఒంటరి గా ఉంటున్న కారణంగా ఆమె పట్ల సింపతీ పెరిగింది. అదీ గాక టాస్క్ లో ఆమె పర్ ఫార్మెన్స్ అదుర్స్ అనే చేప్పాలి. ఈ కారణంగా ఆమె కూడా సేవ్ అవుతుంది. ఇక బాబా భాస్కర్, రవిలలో ఇద్దరూ సేఫ్ గేమ్ ఆడుతున్నట్టే అనిపిస్తుంది. రాహుల్, వరుణ్ లు అంతలా గొడవ పడుతున్నప్పుడు అక్కడే ఉన్న వీరిద్దరు నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం. కానీ బాబా భాస్కర్ కి ఉన్న ఫాలోయింగ్ రవికి లేదు.


రవికి ఎక్కడా ఒక స్థిరమైన అభిప్రాయం ఉన్నట్టు కనబడదు. రాహుల్ వద్దకి వెళ్ళి నీ తప్పు లేదని అంటాడు. అలాగే వరుణ్ తో కూడా నీ తప్పేమీ లేదు అంటాడు. ఎవరో ఒకరి వైపు నిలబడి తన వాదన బలంగా వినిపించి ఉంటే మరింత బాగుండేది.  ఇంకో విషయం ఏంటంటే, రవి శ్రీముఖితో స్నేహంగా ఉంటాడు. మళ్ళీ  శ్రీముఖి గురించి ఇతరులతో నెగెటివ్ గా మాట్లాడతాడు. ఈ ద్వంద్వ ప్రవృత్తి వల్ల అతను ప్రేక్షకుల అభిమానాన్ని కోల్పోతున్నాడని తెలుస్తుంది.వీటన్నింటిని చూస్తుంటే రవి డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: