టాలీవుడ్ ఇండస్ట్రీలో రామ్ చరణ్ మరియు దగ్గుబాటి రానా చిన్ననాటి నుండి మంచి ఫ్రెండ్స్ అని అందరికీ తెలుసు. చిన్ననాటి నుండి ఇప్పటివరకు ఇండస్ట్రీలో ప్రాణ స్నేహితులు గానే ఈ ఇద్దరు హీరోలు మెలుగుతూ వస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ మద్రాస్ నుండి హైదరాబాద్ రాకముందే వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం ఇప్పటి వరకు కొనసాగడం అంటే వీరిద్దరిదీ మామూలు స్నేహం కాదు అని చెప్పవచ్చు. చాలా సినిమా వేడుకలలో వీరిద్దరు కూడా వీరిద్దరి ఫ్రెండ్ షిప్ గురించి చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలో రామ్ చరణ్ నిర్మాతగా తండ్రి మెగాస్టార్ చిరంజీవి హీరోగా పెట్టి సైరా సినిమా తెరకెక్కించిన విషయం అందరికి తెలిసిందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా సౌత్ ఇండస్ట్రీ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రికార్డు స్థాయిలో విడుదల కానుంది.


ఇటువంటి నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో బాలీవుడ్ లో రామ్ చరణ్ కి హెల్ప్ చేయడానికి రానా రంగంలోకి దిగినట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినబడుతున్నాయి. ఇటువంటి నేపథ్యంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో నార్త్ లో ఓ ప్రముఖ కామిక్ పుస్తకాల సంస్థ తో సైరా సినిమాకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు చేసేలా రానా తన ప్రాణ స్నేహితుడు రామ్ చరణ్ కోసం పావులు కదుపుతున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి. ఈ కామిక్ పుస్తకాల సంస్థ భారత సంస్కృతికి చెందిన విషయాలను ప్రమోట్ చేసే సంస్థ అని చాలా చోట్ల ఈ లెర్నింగ్ సెంటర్లను పుస్తకాలు సంస్థను ఈ సంస్థ పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్లు ఈ సంస్థ కి రానా మద్దతు తెలుపుతూ ప్రచారం చేస్తూ తన వంతు సహాయం తెలుపుతున్నట్లు మంచి వార్తలు వినపడుతున్నాయి.


ఇంతకీ ఈ కామిక్ పుస్తకాలు సంస్థ పేరు ఏమిటంటే ‘అమర్ చిత్ర కథ’. ఈ నేపధ్యంలో అమర చిత్ర కథ గ్రూప్ తో తనకు ఉన్న అనుబంధంతో  ‘నరసింహా రెడ్డి.. ది లయన్ ఆఫ్ రాయలసీమ’ అనే టైటిల్ ఓ కామిక్ బుక్ తేనున్నారు దగ్గుబాటి రానా. మొత్తం మీద స్నేహితుడైన రామ్ చరణ్ నిర్మిస్తున్న సైరా సినిమా కి తనవంతుగా తనదైన శైలిలో ప్రమోషన్ చేయటానికి రానా సిద్ధమైనట్లు తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: