తెలుగులో ఉన్న కమెడియన్లు మరే ఇండస్ట్రీలోనూ ఉండరేమో! ఒకటి కాదు రెండు కాదు లెక్కపెట్టడానికి వీలులేనంత మంది కమెడియన్లు ఉన్నారు. తెలుగులో  హీరోల తర్వాత కమెడియన్లకే అంతటి పాపులారిటీ ఉంటుంది. చాలా సినిమాలు కామెడీ వర్కవుట్ అవడం వల్లనే హిట్ అయిన సందర్భాలు అనేకం. హాస్యాన్ని అంతలా ఆస్వాదించే తెలుగువారికి ఆ హాస్యాన్ని పంచే వారంటే కూడా ప్రాణమే. అందుకే మన సినిమాల్లో హాస్యం ప్రధానంగా ఉంటుంది.  అయితే  గ‌త ద‌శాబ్ద కాలంలో  తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతోమంది గొప్ప క‌మెడియ‌న్ల‌ను కోల్పోయింది. ఎమ్మెస్ నారాయ‌ణ‌, ఏవీఎస్‌, ధ‌ర్మ‌వ‌ర‌పు సుబ్ర‌హ్మ‌ణ్యం, ఆహుతి ప్ర‌సాద్.. ఇలా చాలామంది లెజెండ్స్ కాలం చేశారు.  


అయితే వారంతా వయస్సు పెరిగి కాలం చేశారు. కానీ వేణు మాధవ్ ఇంకా వయసులో ఉండగానే అనారోగ్యం కారణంగా ఆఖరి శ్వాస విడిచాడు. ఒక‌ప్పుడు తెలుగులో టాప్ క‌మెడియ‌న్‌గా ఒక వెలుగు వెలిగిన వేణు మాధవ్, కొన్నేళ్లుగా సినిమాలు చేయడం మానేశారు. అయితే ఆయన అనారోగ్యం గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అనేక పుకార్లు వెలువడ్డాయి. వేణు మాధవ్ వాటన్నింటిని ఖండించాడు.


కానీ అనూహ్యంగా ఇలా జరగడం చిత్ర పరిశ్రమని శోక సంద్రంలో నింపింది. టాలీవుడ్ ప్రముఖులు వేణు మాధవ్ కి మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆయనతో నటించిన తోటి నటులు, తోటి కమెడియన్లు ఆయనతో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రముఖ కమెడియన్ కమ్ రైటర్ ఎల్ బీ శ్రీరామ్ తన సంతాపాన్ని వ్యక్తపరిచిన తీరు ఎందరినో కన్నీళ్ళు పెట్టించింది. వారిద్దరు కలిసి చేసిన హిట్ సినిమా దిల్ లోని ఫోటోని పెట్టి, నువ్వూ వెళ్తున్నావా వేణూ! వెళ్తూ ఒక నవ్విచ్చి వెళ్ళు.. నేను ఒచ్చేక ఇచ్చేస్తా..అంటున్న వీడియో హృద్యంగా ఉండి ప్రతీ మనసుని తాకి కన్నీళ్ళు పెట్టించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: