టాలీవుడ్ లో తనదైన కామెడీ ముద్ర వేసిన హాస్య నటుడు వేణు మాధవ్ నిన్న మధ్యహ్నాం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కన్నుమూశారు.  గత కొంత కాలంగా ఆయన కాలేయ, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతూ నిన్న తుది శ్వాస విడిచారు.  టాలీవుడ్ లో ఎన్నో కామెడీ పాత్రలు పోషించి తనదైన మార్క్ చాటుకున్న వేణు మాధవ ఇకలేరు అన్న వార్త విని తెలుగు చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. 

ఈ రోజు వేణు మాధవ్ భౌతికఖాయాన్ని హైదరాబద్ లో ఫిల్మ్ ఛాంబర్ లో అభిమానుల సందర్శనార్థం ఉంచిన విషయం తెలిసిందే.  తమ నవ్వుల నల్లబాలు ఇక లేరు..తిరిగిరాని లోకానికి వెళ్లాడని శోకిస్తూ సినీ ప్రముఖులు, అభిమానులు సందర్శించుకున్నారు.  వేణు మాధవ్ భౌతికఖాయానికి మౌలాలీలోని లక్ష్మీనగర్ స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. వేణు మాధవ్ పెద్ద కుమారుడు మాధవ్ సవికర్ చేతుల మీదుగా ఆయన భౌతికఖాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు.

కాగా,  కొద్దీ సేపటి క్రితమే వేణు మాధవ్ అంతిమ యాత్ర మొదలైంది.  venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ మరణం సినిమా ఇండస్ట్రీకి తీరని లోటని సినిమాల ద్వారా ఆయన అభిమానుల గుండెల్లో బ్రతికే ఉంటారని సినిమా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.  వేణు మాధవ్ మృతి పట్ల తోటి కమెడియన్లు కన్నీరు మున్నీరయ్యారు.  పవన్ కళ్యాణ్, చంద్రబాబు, అనుష్క, మహేష్ బాబు వంటి ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఇక 400కి పైగా సినిమాల్లో నటించిన venu COMEDIAN' target='_blank' title='click here to read more about venu COMEDIAN'>వేణుమాధవ్ లక్ష్మి సినిమాకు గాను బెస్ట్ కమెడియన్ గా నంది పురస్కారాన్ని అందుకున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: