‘సైరా’ మ్యానియా మరింత పెంచడానికి ఈరోజు ఉదయం విడుదలచేసిన ట్రైలర్ మెగా అభిమానులకు విపరీతంగా కనెక్ట్ అయిపోయింది. ఈ ట్రైలర్ కు ‘బ్యాటిల్ ఫీల్డ్' అంటూ టైటిల్ పెట్టి ఈ మూవీకి బాలీవుడ్ లో మరింత క్రేజ్ ను తీసుకుని వచ్చే ఉద్దేశ్యంతో విడుదల చేసారు. 

ఈ ట్రైలర్ లో విపరీతమైన యాక్షన్ సీన్స్ ఎమోషన్స్ డైలాగులతో నిండిపోయినా యాక్షన్ పార్ట్ అంతా రియలిస్టిక్ గా కనిపించడంలేదు అంటూ బాలీవుడ్ మీడియా కామెంట్స్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ దర్శకుడు ఒక అద్భుతమైన చిత్రం తీయాలన్న తపనతో ప్రతి విషయంలో ఎక్కువగా చేసి చూపెట్టడంతో వీఎఫ్ఎక్స్ విజువల్స్ విషయంలో అంచనాలు అందుకునేలా ఉన్నప్పటికీ చిరంజీవి వయసు  ఆపాత్రకు మిస్ మ్యాచ్ అయిందా అంటూ బాలీవుడ్ లోని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. 

మరికొన్ని బాలీవుడ్ మీడియా వర్గాలు అయితే ఈ ట్రైలర్ ను చూస్తుంటే ఎక్కడో ఏదో వెలితి కనిపిస్తోందని అర్థం అభిప్రాయపడుతూ అమీర్ ఖాన్ అమితాబ్ ల ‘థగ్స్ ఆఫ్ హిందుస్తాన్’ ఛాయలు ఈ ట్రైలర్ లో కనిపిస్తున్నాయి అంటూ కొన్ని బాలీవుడ్ మీడియా వర్గాలు కామెంట్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉండగా ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల్లో ఆశక్తి కనిపిస్తోంది కానీ బాలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇతర భాషా ప్రేక్షకులకు ‘సైరా’ పట్ల ఇంకా పూర్తి మ్యానియా రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. 

వాస్తవానికి తెలుగు సినిమాల ప్రమోషన్స్ కు హిందీ సినిమాల ప్రమోషన్స్ కు చాలతేడా ఉంటుంది. ఎంత పెద్ద బాలీవుడ్ స్టార్ అయినప్పటికీ తమ సినిమాలు బాలీవుడ్ లో రిలీజ్ అవుతునప్పుడు తమ సినిమాలకు ఒక పది రోజుల పాటు భారీ ప్రమోషన్స్ చేయడమే కాకుండా అక్కడ హిందీ పత్రికలకు అదేవిధంగా హిందీ ఛానల్స్ కు  ముఖ్యంగా బిగ్ బాస్ లు నచ్ బలియేలు కపిల్ శర్మ షోలకు వచ్చి తీరుతారు. ఇక ‘సాహో’ విడుదల కేవలం ఆరురోజులు మాత్రమే ఉన్నా ఇంకా బాలీవుడ్ మీడియాలో కనిపించకపోవడం ఏమిటి అంటూ బాలీవుడ్ మీడియా ఎదురుప్రశ్నలు వేస్తోంది.. 



మరింత సమాచారం తెలుసుకోండి: