నయనతార వెడ్స్ విఘ్నేష్ అంటూ  పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్లు అది కూడా వచ్చే డిసెంబర్‌ 25న అని సోషల్ మీడియా లో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.టాలీవుడ్ లో అనుష్క తరువాత కోలీవుడ్ లో నయన్ పెళ్లికాని భామల లిస్టులో ముందు ఉంటారు.  గత కొంతకాలంగా దర్శకుడు విఘ్నేష్ శివన్‌తో ప్రేమలో ఉన్న నయన తార ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతుందని అంటున్నారు.

 ఇన్నాళ్లు ప్రేమ పక్షుల్లా విహరిస్తు, సినిమాలతో బిజీ బిజీ గా గడిపిన ఈ ప్రేమ జంట ఓ గూటికి చేరబోతున్నారు.  ఇక ఇప్పటికే  విఘ్నేశ్‌శివన్, నయనతారలు తమ  వివాహానికి సన్నాహాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వేడుకలు చెన్నైలోనూ, కేరళలోనూ కాదట. ఉత్తరాదిలోనో, లేక విదేశాల్లో క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా 5 రోజుల పాటు వివాహ వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారట. గతంలోనూ ఈ క్రేజీ హీరోయిన్ పెళ్లికి సంబంధించిన వార్తలు వచ్చినప్పటికీ ఈ సారి ఖశ్చితంగా నయన్ పెళ్ళి ఖాయం అంటున్నారు.

ఎందుకంటె ఇద్దరి కమిట్‌మెంట్స్ పూర్తికావడంతో పాటు ఇరు కుటుంబాల పెద్దలు వీరి పెళ్లికి ఒప్పుకున్నారట.గతంలో రెండు సార్లు ప్రేమలో ఫెయిలైన నయనతార... ఈ సారి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకునే విషయంలో ఏ మాత్రం తొందరపడకూడదని భావించిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ఈ కారణంగానే ప్రియుడు విఘ్నేష్‌ను పెళ్లి చేసుకునే విషయంలో నయన్ ఇంతకాలం వెయిట్ చేసిందంటున్నారు.

 ఇంతకాలం ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేకపోవడంతో పాటు తన అభిప్రాయానికి విఘ్నేష్ పూర్తి విలువ ఇస్తాడని నయన్ నిర్ణయానికి వచ్చిందట.  అందుకే పెళ్లికి ఓకే చెప్పిందంటున్నారు నయనతార సన్నిహితులు.దీంతో  డిసెంబర్‌లో నయనతార విఘ్నేష్ శివన్ పెళ్లి జరగబోతోందని కోలీవుడ్ల్లో ప్రచారం మొదలైంది. కానీ  నయన్ మాత్రం ప్రియుడితో ఓ వైపు ఫారిన్ టూర్లకు వెళ్లడం, తన సినిమాలకు డేట్స్ ఇవ్వడం తప్పితే... తన పెళ్లి గురించి అధికారికంగా ఏ ప్రకటన ఇవ్వలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: