మాఘ మాసం ఎప్పుడొస్తుందో అంటూ 90లలో ప్రేక్షకుల మదిని దోచిన నటి లైలా.ప్రేమ జంట లైలా మజ్నుల కంటే తెలుగు ప్రేక్షకులకు ఎగిరే పావురమా సినిమాలో లైలానే బాగా గుర్తు.తన క్యూట్ ఫెరఫార్మన్స్ తో ఆకట్టుకున్న లైలా సినిమాలకు దూరమై చాల కాలమే అయ్యుంది. శ్రీకాంత్,తమిళ హీరో సూర్యతో పాటు బాలయ్య లాంటి పెద్ద హీరోలతో కూడా సినిమాలు చేసింది లైలా. ఐతే ఇప్పుడు సడన్ గా నందమూరి బాలకృష్ణతో తీసుకున్న ఫొటోతో నెట్టింట్లో దర్శనమిచ్చింది.

తన 105వ చిత్రంగా నందమూరి నటసింహం  బాలకృష్ణ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నసంగతి తెల్సిందే. ఇటీవలే  ఆ చిత్రం షూటింగ్ బ్యాంకాక్ లో జరిగింది. బాలకృష్ణ, హీరోయిన్  సోనాల్ చౌహాన్ లపై పాట మరియు  కొన్ని కీలక సన్నివేశాలను అక్కడ చిత్రీకరించారు.

అప్పుడే బ్యాంకాక్ లో బాలయ్యను కలిసింది క్యూట్ హీరోయిన్ లైలా. ఈ సందర్భంగా బాలకృష్ణ మరియు సోనాల్ చౌహాన్ లతో కలిసి లైలా ఫొటోకు ఫోజ్ ఇచ్చింది. గతంలో బాలకృష్ణతో ఆమె 'పవిత్ర ప్రేమ' అనే సినిమాలో నటించింది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ బాలకృష్ణ గారిని చూస్తుంటే ఐరెన్ మన్ లా అనిపిస్తున్నారంటూ కామెంట్ చేశారు. నిజంగానే ఆయన ఐరెన్ మ్యాన్.. రియల్ లైఫ్ లో కూడా ఆయన ఐరెన్ మన్ అంటూ లైల్  పోస్ట్ చేసింది.


ఈ సందర్భంగా బాలకృష్ణ గారితో చేసిన 'పవిత్ర ప్రేమ' చిత్రం రోజులను గుర్తుచేసుకుంది. షూటింగ్ అరకులో చేస్తున్న సమయంలో ఉదయం 3 గంటలకు లేచి జాగింగ్ కు వెళ్లే వారట బాలయ్య.  షూటింగ్ సమయంలో బాలయ్యను  కలిసేందుకు వచ్చిన అభిమానులతో చాలా ఓపికగా మాట్లాడేవారు. ఇక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అవుతున్నట్లు కూడా  ఆ మద్య  పలు వార్తలు వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: