యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర సమర్పణ లో రామ బ్రహ్మం సుంకర నిర్మాతగా తెరకెక్కిన లేటెస్ట్ స్పై థ్రిల్లర్ చాణక్య. ఇటీవల రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ మరియు రెండు సాంగ్స్ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేసాయి. గోపిచంద్ సరసన మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఇండో పాక్ సరిహద్దుల్లో మెజారిటీ షూటింగ్ చేయడం జరిగింది. ఆకట్టుకునే కథ, కథనాలతో యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసారు యూనిట్ సభ్యులు. 

ఇక ఈ ట్రైలర్ ని బట్టి చూస్తుంటే గోపిచంద్ ఇందులో రా ఏజెంట్ గా నటిస్తున్నట్లు తెలుస్తుంది. భారత్, పాక్ మధ్య టెర్రరిస్టుల అటాక్ నేపథ్యంలో ఈ కథ సాగనుందని తెలుస్తుంది. 'ఈ ఆపరేషన్ ని ఎవరు లీడ్ చేస్తున్నారు అనగానే', 'అర్జున్, అర్జున్ శ్రీకర్' అంటూ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ఒక వాయిస్ తో ట్రైలర్ మొదలవుతుంది. సునీల్ మరియు రఘు బాబు ఫన్నీ కామెడీ డైలాగ్స్, ఫైట్స్, యాక్షన్ సీన్స్, హీరోయిన్ మెహ్రీన్ అందాలతో పాటు 'కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ అందరికి చెప్పండి, అర్జున్ కనిపిస్తే వెంటనే చంపేయమని షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇస్తున్నాను' 

అంటూ జయప్రకాశ్ పలికే డైలాగ్ ఆలోచింప చేస్తుంది. ఇకపోతే ట్రైలర్ లో గోపీచంద్ చెప్పిన ' చావుకు తెగించినవాడు బుల్లెట్ కి భయపడడు ఖురేషి' అనే డైలాగ్ తో ఆయన పవర్ఫుల్ క్యారెక్టర్ లోని ఇంటెన్సిటీని మనకు తెలియచేస్తుంది. మొత్తంగా ఈ చాణక్య ట్రైలర్, త్వరలో రిలీజ్ కాబోయే సినిమా పై అమాంతం అంచనాలు పెంచిందనే చెప్పాలి. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను దసరా పండుగ కానుకగా అక్టోబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు......!!  


మరింత సమాచారం తెలుసుకోండి: