గత సంవత్సరం శ్రీ రెడ్డి చేసిన రభస అంతా ఇంతా కాదు. తెలుగు చిత్రసీమ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ కొంతమంది నిర్మాతలు మరియు వారి కొడుకుల మీద ఆరోపణలు చేసిన ఆమె తర్వాత అనవసరంగా ప్రముఖ సినీ నటుడు మరియు రాజకీయవేత్త అయిన పవన్ కళ్యాణ్ మీద కూడా వ్యక్తిగత దూషణలు చేసింది. చివరికి నానా రచ్చ లేపి అన్నీ వదిలేసి వెళ్లి తన మకాం చెన్నై కి మార్చింది. అప్పటినుంచి సోషల్ మీడియా లో తప్ప మరెక్కడా కనపడని శ్రీ రెడ్డి గత కొద్ది రోజులుగా తన ఫేస్ బుక్ అకౌంట్ లో హంగామా చేస్తోంది.


మొదటినుంచి తనను తాను అతిగా అంచనా వేసుకునే శ్రీరెడ్డి అసలు తెలుగు చిత్రసీమకు సంబంధించిన వ్యక్తి అని ఆమె కాస్టింగ్ కౌచ్ పైన ఆరోపణలు చేసే దాకా తెలియదు. తర్వాత తన సోషల్ మీడియా పోస్టుల్లో హాట్ పిక్స్ అప్లోడ్ చేయడం.... కావాలని తన అందాలని బహిర్గత పరుస్తూ కుర్రకారును రెచ్చగొట్టడం వంటి ఎన్నో చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ డోస్ కాస్త మితిమీరింది అనే చెప్పాలి. ఈ మధ్య తన పెడుతున్న ఫోటోలు మరియు వీడియోలు చాలా వల్గర్ గా ఉన్నాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు.

ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఆమె అంటున్న మాటలు అయితే వర్ణనాతీతం. మేము ప్రస్తావించలేక కింద ఆమె తన ఫేస్బుక్ అకౌంట్ లో వేసిన పోస్ట్ ని పెట్టాం చూడండి. పవన్ కళ్యాణ్ ని నేరుగా అనే అనే ధైర్యం లేక 'పీకే' అంటూ ఆమె పెట్టిన పోస్టులు ఇప్పటికే ఆయన ఫ్యాన్స్కు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. తను ప్రొఫెషనల్ గా నటి అయినా అనవసరంగా రాజకీయాల్లో తల దూరుస్తూ ఇలా పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా బురద జల్లడం తో త్వరలోనే ఆమెపై సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని పలువురు చెబుతున్నారు. 



కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు అన్నట్లు ప్రవర్తించే శ్రీరెడ్డి ఆగడాలు మరి ఇంకెంత కాలం కొనసాగుతాయో.. ఎంతవరకు వెళ్తాయో వేచి చూడాలి మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: