ప్రముఖ నటుడు మరియు రాజకీయ నాయకుడైన కమల్ హాసన్ కు సంబందించిన ఒక వార్త నేడు కోలీవుడ్ మీడియా వర్గాల్లో విపరీతంగా సంచలనం అవుతోంది. ఎటువంటి పాత్రలో అయిన పరకాయ ప్రవేశం చేసి, తనదైన ఆకట్టుకునే నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగల కమల్ కు తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. అలానే తమిళ్ తో పాటు పలు ఇతర భాషల్లో కూడా నటించిన ఆయన, ఆయా భాషల్లో కూడా ఎన్నో అద్భుతమైన విజయాలను దక్కించుకున్నారు. 

ఇకపోతే నేడు సంచలనం అవుతున్న ఆ వార్త ఏంటంటే, తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన బడా నిర్మాతల్లో ఒకరైన  స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేయి జ్ఞానవేల్‌ రాజా, నేడు నిర్మాతల మండలిని ఆశ్రయించి కమల్ పై కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే, 2015లో రిలీజ్ అయిన కమల్ సొంత సినిమా ఉత్తమ విలన్‌ కు సంబంధించి తన వద్ద 10 కోట్ల రూపాయిలు అప్పుగా తీసుకోవడం జరిగిందని, అయితే ఆ డబ్బు ఇప్పటివరకు తిరిగి ఇవ్వకుండా బకాయి పడ్డట్టుగా జ్ఞానవేల్‌ రాజా తన కంప్లైంట్ లో పేర్కొన్నారు. అయితే కొన్నాళ్ల క్రితం డబ్బుకు బదులుగా స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు కమల్ ఒప్పందం కూడా చేసుకున్నారట. కానీ ఇప్పటికి నాలుగేళ్లు గడుస్తున్నప్పటికీ కమల్‌ ఇంతవరకు తనకు కాల్‌ షీట్స్‌ ఇవ్వకపోవటంతో, నేడు రాజా నిర్మాతల మండలిని ఆశ్రయించారు.  

కాగా ఈ విషయమై నిర్మాత మండలి సభ్యులు కలుగచేసుకొని, కమల్‌ కాల్‌ షీట్స్‌ కానీ లేదా తన డబ్బు తనకు వెనక్కి గాని ఇప్పించాలని రాజా కోరుతున్నారు. ఇక ఈ వార్తతో ఒక్కసారిగా తమిళ సినిమా ఇండస్ట్రీ లో పెద్ద దుమారమే చెలరేగింది. నిజానికి ఈ విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలియదని, అయితే రాజా గారు చెప్తున్నట్లు కమల్ గారు కనుక డబ్బు తీసుకుని, ఇప్పటివరకు చెల్లించనట్లైతే రాజా గారికి పూర్తి న్యాయం చేసేలా నిర్మాతల మండలి వ్యవహరించనున్నట్లు సమాచారం. అయితే నిర్మాతల మండలి సభ్యులు ఈ విషయమై ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై అందరిలోనూ ఎంతో ఆసక్తి నెలకొని ఉంది......!!   


మరింత సమాచారం తెలుసుకోండి: