మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక కొణిదెల. మెగా బ్రదర్ నాగబాబు గారల పట్టి, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ముద్దుల చెల్లి. మొదటిసారి యాంకర్ గా బుల్లితెర మీద చక్కగా పర్ఫార్మ్ చేసి అందరిని ఆకర్షించింది. అంతే సినిమాలో హీరోయిన్ అయిపోయింది. ఇక తెలుగులో వెబ్ సిరీస్ ల సాంప్రదాయానికి  శ్రీకారం చుట్టిన ప్రతిభ కల నాన్న కూచి. ముద్దపప్పు ఆవకాయ సిరీస్ లో నటించిన నిహారిక.. తండ్రి నాగబాబుతో కలిసి నాన్న కూచి వంటి వెబ్ సిరీస్ లో అలరించింది. ఒక మనసుతో వెండితెరపై కథానాయికగా తెరంగేట్రం చేసింది. అమ్మాయిలు ఎందుకు నటించకూడదు? అంటూ బలమైన వాదన వినిపించి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక కు ఎంట్రీ సాఫీగానే కుదిరింది కానీ అనుకున్న స్థాయిలో మాత్రం సక్సెస్ రాలేదు.

హ్యాపీవెడ్డింగ్ - సూర్యకాంతం లాంటి సినిమాలు సక్సెస్ నివ్వకపోవడం నిరాశను మిగిల్చింది. అందుకే ఇటీవల మళ్లీ వెబ్ సిరీస్ ల బాటపట్టింది. తను నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ మ్యాడ్ హౌజ్. కంప్లీట్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యాగ్డ్రాప్ లో ఈ వెబ్ సిరీస్ ని వంద ఎపిసోడ్లు షూట్ చేశారు. అధికారికంగా సిరీస్ ని ఇటీవలే లాంచ్ చేశారు నిహారిక. ప్రస్తుతం చిరు నటించిన సైరా నరసింహారెడ్డిలో మెరుపులా మెరిసే పాత్రలో కనిపించబోతున్న నిహారిక ఇన్ స్టాలో బ్లూకలర్ సారీలో వున్న రెండు ఫొటోలని పోస్ట్ చేసి దానికి స్వైప్ నెక్ట్స్ టూ మేక్ మీ స్మైల్  అని ఆసక్తికరంగా ఒక వ్యాఖ్యను ట్యాగ్ చేసింది. దీనిపై నెటిజనులు, మెగా ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారు.

చీరలో మరీ ఓల్డ్ గా కనిపిస్తున్నావంటు కొంత మంది నెటిజన్లు కామెంట్ చేస్తే రామ్ చరణ్ సోదరి సుస్మిత మాత్రం ఐ లవ్ ఇట్ అంటూ కామెంట్ ని ట్యాగ్ చేశారు. నిహారిక చీరకట్టులో వున్న ఫొటోలు ప్రస్తుతం ఇన్ స్టాలో వైరల్ గా మారాయి. నిజంగా చూస్తే ఈ  ఫోటోలో నిహారిక చాలా చక్కగా, అందంగా కనిపిస్తుంది. ఈ లుక్ ని బట్టు చూస్తూంటే మంచి ఫ్యామిలి హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీలో సెటిలవడం ఖాయమని అనిపిస్తోంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: