87 సంవత్సరాల తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇండస్ట్రీ హిట్లు, బ్లాక్ బస్టర్ హిట్లు, హిట్లు, ఫ్లాప్ సినిమాలు, డిజాస్టర్లు ప్రతి హీరో కెరీర్లో ఉన్నాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలను ఇచ్చాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ సినిమాలు పెరుగుతున్నట్లే, సినిమాలకు నెగిటివ్ టాక్ వస్తే నష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ 5 భారీ నష్టాలు ఇచ్చిన సినిమాలు సాహో, అజ్ఞాతవాసి, స్పైడర్, ఎన్టీయార్ బయోపిక్, బ్రహ్మోత్సవం. 
 
విడుదలకు ముందు 300 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సాహో సినిమాకు అన్ని భాషల్లో 222 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. అన్ని భాషల్లో ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు 78 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వచ్చిన అజ్ఞాతవాసి సినిమా 123 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయగా 60 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు మాత్రమే వచ్చాయి. 
 
అజ్ఞాతవాసి సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు 63 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. మహేశ్ బాబు మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన స్పైడర్ సినిమా తెలుగు, తమిళం భాషల్లో 120 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమాకు రెండు భాషల్లో 62 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు 58 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. బాలకృష్ణ క్రిష్ కాంబినేషన్లో రెండు భాగాలుగా తెరకెక్కిన ఎన్టీయార్ బయోపిక్ 72 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 
 
ఈ సినిమా రెండు భాగాలకు కేవలం 20 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు 52 కోట్ల రూపాయలు నష్టపోయారు. మహేశ్ బాబు శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో వచ్చిన బ్రహ్మోత్సవం సినిమా 72 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమాకు 35 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లు రాగా సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లకు 37 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: