ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కుటుంబ సభ్యులు ‘సైరా’ విడుదలను నిలిపివేయాలి అంటూ వేసిన పిటీషన్ పై హైకోర్టు నిన్న తన విచారణను చేపట్టి ఈ మూవీ విడుదలకు స్టే ను నిరాకరించినా ఈ వివాదం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేయడంతో కోర్టు నిర్ణయం పై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

తాత్కాలికంగా ఈ మూవీ విడుదల సమస్యల నుండి బయటపడినా ఇంకా ఏఏ విషయాలు కోర్టు విచారిస్తుంది అన్న విషయమై కొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు.
ఇది ఇలా ఉంటే ఈ మూవీ దర్శకుడు సురేంద్ర రెడ్డి నిన్న కోర్టులో తన వివరణ ఇస్తూ ‘సైరా’ ఉయ్యాలవాడ బయోపిక్ కాదనీ కేవలం ఆయన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా తీసుకుని నిర్మించిన మూవీ అంటూ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఇది ఇలా కొనసాగుతూ ఉంటే హైదరాబాద్ విశాఖపట్నం ప్రాంతాలలో ‘సైరా’ కు కోరుకున్న స్థాయిలో మల్టీ ప్లెక్స్ స్క్రీన్స్ లభించడం లేదు అన్న వార్తలు గుప్పుమంటున్నాయి.

దీనికి కారణం ఈ మూవీతో పోటీగా విడుదల అవుతున్న హృతిక్ రోషన్ ‘వార్’ అని తెలుస్తోంది. ఈ మూవీకి ప్రధాన నగరాలలోని అన్ని మల్టీ ప్లెక్స్ లలోను స్క్రీన్స్ ఇస్తున్న నేపధ్యంలో ‘సైరా’ కు కొన్ని స్క్రీన్స్ తగ్గుతున్నట్లు సమాచారం. ఈ స్క్రీన్స్ కన్ఫ్యూజన్ వల్ల ఇంకా ‘సైరా’ కు ఆన్ లైన్ బుకింగ్ ప్రారంభం కాలేదు అని అంటున్నారు. 

దీనికితోడు ‘సైరా’ సెన్సార్ సర్టిఫికేట్ నిన్న సాయంత్రానికి నిర్మాతల చేతికి వచ్చిందని అంటున్నారు. దీనితో ఈ సర్టిఫికేట్ ను ఆధారంగా చేసుకుని బాలీవుడ్ లో తమ సినిమాను డబ్బింగ్ సినిమాగా చూపించి ముంబాయి సెన్సార్ బోర్డ్ నుండి అక్కడ సర్టిఫికేట్ ఇంకా తెచ్చుకోవాలి అని తెలుస్తోంది. దీనితో ఒక్క క్షణం ఆలస్యం లేకుండా ‘సైరా’ టీమ్ పరుగులు తీస్తున్నట్లు సమాచారం. ఈ పనుల బిజీ మధ్య ‘సైరా’ ప్రమోషన్ ను చూసుకుంటూ ఈ మూవీ పై వస్తున్న నెగిటివ్ వార్తలకు చెక్ పెట్టే విధంగా వ్యూహాలు రచించడంలో చరణ్ చిరంజీవిలు ఒక్క క్షణం తీరికలేకుండా కాలంతో పరుగులు తీస్తున్నట్లు సమాచారం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: