ఇప్పటివరకు గ్లామర్ పాత్రలు చేసి  అలరించిన  మిల్కీ బ్యూటీ మొదటి సారి ఓ డిఫ్రెంట్ రోల్ లో కనిపించనుంది.  ఇటీవల  తమన్నా..  సంపత్ నంది- గోపిచంద్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న   స్పోర్ట్స్ డ్రామా లో నటించడానికి  అంగీకరించిన విషయం తెలిసిందే.  అందులో భాగంగా ఈ చిత్రంలో తమన్నా  గర్ల్స్ కబడ్డీ టీం కు కోచ్ గా కనిపించనుందని సమాచారం. ఈ కబడ్డీ కోచ్  పాత్ర కోసం ప్రస్తుతం తమన్నా తన లుక్ ను మార్చుకొనే పనిలో  వుంది. యూ టర్న్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి  నిర్మించనున్న ఈ చిత్రం నవంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. 


ఇక  గోపిచంద్ కు  సంపత్ నంది తో ఇది రెండో చిత్రం. ఇంతకుముందు వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన  గౌతమ్ నంద   బాగుందని  అనిపించుకుంది కానీ  ఎందుకో  బాక్సాఫీస్ వద్ద  సత్తా చాటలేకపోయింది. ఇక ఇప్పుడు గోపించంద్ ఈ డైరెక్టర్ కు రెండో సారి ఛాన్స్ ఇచ్చాడు. కాగా  సంపత్ నంది  డైరెక్షన్ లో తమన్నా కు మూడో సినిమా. ఇంతకుముందు ఆమె  సంపత్ నంది తెరకెక్కించిన  రచ్చ , బెంగాల్ టైగర్ చిత్రాల్లో  హీరోయిన్ గా నటించింది.  ఇదిలా ఉంటే ఈఏడాది ఎఫ్ 2 తో భారీ హిట్ కొట్టిన  తమన్నా చేతిలో  ఈసినిమా తప్ప వేరే ఆఫర్లు లేవు. 


అయితే    జయాపజయాలతో సంబందం లేకుండా గోపిచంద్ మాత్రం  వరుస సినిమాలతో  ఫుల్  బిజీగా వున్నాడు. ఇటీవలే  ఆయన , తిరు డైరెక్షన్ లో  చాణక్య సినిమాను పూర్తి చేయగా  అక్టోబర్ 5న  ఈ చిత్రం విడుదలకానుంది. ఈచిత్రం తరువాత  గోపిచంద్  నూతన దర్శకుడు బిను సుబ్రమణ్యం అలాగే సంపత్ నంది  డైరెక్షన్ లో సినిమాలు చేయనున్నాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: