బుల్లి తెరపై హాట్ యాంకర్ గా దూసుకుపోతున్న హాట్ బ్యూటీ శ్రీముఖి.. తన అల్లరితో, మేల్ యాంకర్స్ తో ఈమె చేసే స్టేజ్ రొమాన్స్ అందరిని ఆకట్టుకుంటూ వస్తుంది. అలా ఆమె యాంకరింగ్ లో ఒక్కోమెట్టు ఎదుగుతూ వస్తుంది. ఇకపోతే ఈమె పటాస్ షో లో రవితో చేసిన రొమాన్స్ కాలేజీ స్టూడెంట్స్ ను బాగా ఆకట్టుకోవడంతో ఆ షో టిఆర్పి కూడా బాగా పెరిగింది. అయితే, ఆమె బిగ్ బాస్ లో కంటెస్టెంటుగా పార్టిసిపేట్ చేయడం కోసం ఆ షో కి గుడ్ బై చెప్పింది. 



ఇకపోతే ప్రస్తుతం శ్రీముఖి బిగ్ బాస్ 3 లో కంటెస్టెంటుగా కొనసాగిస్తుంది. ఆ షో తో ఇంకొంచం పాపులర్ అయింది. ఆ షో దాదాపుగా పూర్తికావొస్తుంది. ప్రస్తుతం ఈ షో రసవత్తరంగా  సాగుతుంది. ఎప్పుడు గొడవలతో, దూషించుకునే మాటలతో దూసుకుపోతుంది. మొన్నటి వరకు గ్రూపులుగా ఉన్న బిగ్ బాస్ హౌస్ మేట్స్ ప్రస్తుతం నువ్వా నేనా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. 




మొదటి నుండి దూకుడుగా వ్యవహరిస్తున్న శ్రీముఖి ఈ షో లో విన్నారుగా వ్యవహరిస్తుందో లేదో సీజన్ ఎండింగ్లో చూడాలి.. ఇకపోతే ఈరోజు కోసం బిగ్ బాస్ రెండు ప్రోమోలను రిలీజ్ చేసింది. ఒక ప్రోమోలో కంటెస్టెంటుగా అలీ రెజా రీ ఎంట్రీ.. అదేనండి వైల్డ్ కార్డు ద్వారా మళ్ళీ అలీ ని హోస్ లోకి పంపిస్తున్నారు. ఆ ప్రోమోలో షర్ట్‌లెస్ డ్యాన్స్ చూస్తే ఆ ప్రచారం నిజమేనని స్పష్టమవుతోంది. అలీనే హౌస్‌లోకి వస్తున్నాడని తెలుస్తోంది. ఈ విషయం ఇప్పటికే సోషల్ మాధ్యమాల్లో వినపడుతుంది. 




ఇది ఇలా ఉండగా రెండో ప్రోమోలో రెండో ప్రోమోలో శ్రీముఖి పెళ్లి చూపులను చూపించారు. అత్త శివజ్యోతి సమక్షంలో శ్రీముఖి-రవి పెళ్లి చూపులు జరుగుతాయి. ఆ సందర్భంగా యాంకర్ శ్రీముఖి సిగ్గుతో తెగ మెలికలు తిరిగింది. ఎప్పుడు మగరాయుడులాగా ఉన్న శ్రీముఖి ఈ ప్రోమో తలా దించుకొని సిగ్గుపడుతూ వస్తుంది. ఆ పెళ్లి చూపులు తంతు కాస్త అందరిని నవ్వుల్లో ముంచేసింది. మరి శ్రీముఖి పెళ్లి గురించి తెలుసుకోవాలంటే ఇవాళ ఎపిసోడ్ చూడాల్సిందే.. 


మరింత సమాచారం తెలుసుకోండి: