మెగా ఫ్యామిలీ అన్నా ముఖ్యంగా చిరంజీవి పవన్ కళ్యాణ్ ల పైనా చాల ప్రత్యేకమైన అభిమానం రామ్ గోపాల్ వర్మకు ఉంది. దీనితో అవకాశం దొరికితే చాలు చిరంజీవి పవన్ కళ్యాణ్ లను కార్నర్ చేయడానికి రామ్ గోపాల్ వర్మ ప్రయత్నిస్తూ చాల ఘాటైన సెటైర్లు వేస్తూ ఉంటాడు. 

ఈ నేపధ్యంలో వర్మ ‘సాహో’ లేటెస్ట్ ట్రైలర్ ను ప్రశంసిస్తూ చేసిన కామెంట్స్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి. నిన్న విడుదలైన ‘సైరా' సెకండ్ ట్రైలర్ పైన స్పందిస్తూ "వావ్.  మెగాస్టార్ చిరంజీవి గారికి సరిగ్గా సరిపోయే సినిమా 'సైరా'.  నిర్మాత రామ్ చరణ్ అటు నాన్నగారు చిరంజీవి కి.. ఇటు ప్రేక్షకులకు ఇచ్చిన బహుమతి" అంటూ ఒక సగటు మెగా అభిమాని స్పందించే రీతిలో స్పందించడంతో మెగా అభిమానులు సంతోష పడుతున్నా లోలోపల ఈ ట్విస్ట్ వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ లోతుగా ఆలోచనలు చేస్తున్నారు. 

వింత వింత కామెంట్ లు చేయడం వర్మకు అలవాటు అయిన విషయమే అయినా ఎప్పుడు నెగిటివ్ కామెంట్స్ పెట్టే వర్మ నోటి వెంట పాజిటివ్ కామెంట్స్ రావడంతో ఎవరు నమ్మలేక పోతున్నారు. దీనితో ఈ మూవీలో అమితాబ్ ఉన్నాడని ఇలా వర్మ తన రూట్ మార్చుకున్నాడా అంటూ మరికొందరు జోక్ చేస్తున్నారు. 

అయితే వర్మ రాత్రి అయ్యేసరికి మందు తాగకుండా ఉండలేడు కాబట్టి ఆ కిక్ లో వర్మ నోటివెంట ప్రశంసలు వచ్చినా ఇప్పుడు తెల్లవారింది కాబట్టి ఆ కిక్ దిగిన నేపధ్యంలో మరి ఇంకా ఏమి ట్విస్ట్ ఇస్తాడో అంటూ మెగా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. దీనితో ఎప్పుడు అబద్ధాలు చెప్పే వ్యక్తి నోటివెంట నిజం చెప్పినా నమ్మలేని విధంగా వర్మ పరిస్థితి మారింది అంటూ జోక్స్ పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: