బిగ్ బాస్ లో ఆలీ ఎలిమినేట్ అయినప్పటి  నుండి అతని రీ ఎంట్రీని కోరుకుంటూ అతని అభిమానులు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. నిజానికి ఆలీ స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆయన ఎలిమినేట్ అయిన తర్వాత హౌస్ లో సభ్యులు ఎంత ఎమోషనల్ అయ్యరో చూసాము. ఆలీ ఎలిమినేట్ అయ్యాక టాస్క్ లలో అంత మజా రాలేదన్నది వాస్తవం. అందువల్ల ఆలీ వెళ్ళిపోయాక మళ్ళీ రావాలని కోరుకున్నప్పటికీ ఒకానొక దశలో రీ ఎంట్రీ  ఉండదని వార్తలు కూడా వచ్చాయి.


ఇదే క్రమంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శిల్పా చక్రవర్తి హౌస్ లో తన ప్రభావాన్ని చూపించలేకపోయింది. దీంతో మరో వైల్డ్ కార్డ్ ద్వార కొత్త వ్యక్తిని తీసుకు వస్తారని సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరిగింది. కానీ కొత్త వ్యక్తిని తీసుకురావడం వల్ల ఇంటి సభ్యులను డిస్ట్రబ్ చేసినట్టు అవుతుందని భావించిన బిగ్ బాస్ టీం రీ ఎంట్రీ పై పడ్డారని అంటున్నారు.


అయితే ఎలిమినేట్ అయిన వారందరిలో ఆలీ పైనే సాఫ్ట్ కార్నర్ ఉంది. ఏడు వారాల నుండి నామినేషన్ లోకి రాకపోవడం వల్ల అతనికి మైనస్ అయిందని చాలా మంది భావించారు. అదీ కాకుండా అతను ఎలిమినేట్ అయినప్పటి నుండి మళ్ళీ రావాలని, వస్తున్నాడని రోజూ వార్తలు వచ్చాయి. ఎలిమినేట్ అయిన మిగతా సభ్యులపైన ఇలాంటి వార్తలేమీ రాలేదు. ప్రేక్షకుల్లో ఆలీకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుని అతన్ని మళ్లీ తీసుకు రావాలని భావించినట్టున్నారు.


అయితే ఆలీ ఇంట్లోకి ప్రవేశించిన వెంటనే బిగ్ అతనికి స్వాగతం చెప్తూ " వైల్డ్ కార్డ్ ఆలీ" అంటాడు. బిగ్ బాస్ అలా చెప్పేసరికి అందరూ షాక్ తిన్నారు. కానీ బిగ్ బాస్ అలా చెప్పడానికి కారణం లేకపోలేదు. ఒకసారి ప్రేక్షకులు వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ రీ ఎంట్రీ అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ రీ ఎంట్రీ ఉంటే గనక అది ప్రేక్షకుల అభీష్టం మేరకే జరగాలి. కానీ ఇక్కడ అధికారికంగా అలాంటిదేమీ జరగలేదు. కాబట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని తెలివిగా వ్యవహరించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: