పుత్రుడు పుట్టిన నాడు కాదు..అతడు గొప్ప విషయంలో విజయం సాధించిన నాడు తండ్రి పడే సంతోషానికి హద్దలు ఉండవు అంటారు..ఇప్పుడు  తమిళ హీరో మాధవన్ సంతోషంలో తేలిపోతున్నాడు.  తెలుగు లో మణిరత్నం దర్శకత్వం వహించిన ‘సఖి’ సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన మాధవన్ తమిళ, హిందీ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించారు.   హుభాషా నటుడు మాధవన్‌కు పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాడు. మాధవన్-సరితల పుత్రరత్నం వేదాంత్(14) ఆ మధ్య థాయిలాండ్‌లో జరిగిన అంతర్జాతీయ స్విమ్మింగ్ పోటీల్లో 1500 మీటర్ల ఫ్రీ స్టైల్ విభాగంలో పోటీపడి కాంస్యపతకం అందుకోగా తాజాగా జాతీయ స్థాయి పోటీలలో పాల్గొని మూడు బంగారు, ఒక వెండి పతకాన్ని చేజిక్కించుకున్నాడు.

తనయుడు సాధిస్తున్న ఘనతలని చూసి మాధవన్ గర్విస్తున్నాడు.  మాధవన్ ఈ విషయాలని తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా గర్విస్తూ అభిమానులకి తెలియజేసి ఉబ్బితబ్బిబ్బయ్యారు. కాగా,  వేదాంత్‌ (55.27 సె), ఉత్కర్ష్‌ పాటిల్‌ (57.10 సె), సాహిల్‌ లష్కర్‌ (54.83 సె), సోహన్‌ గంగూలీ (54.29 సె) బృందం 3:41:49 సెకన్లలో ముగించి ద్వితీయ స్థానంలో నిలిచింది. 3:34:60 సమయంతో జపాన్‌ స్వర్ణం సాధించింది. 3:42:29 సమయంతో చైనీస్‌ తైపి బృందం కాంస్యం గెలుచుకుంది. మాధవన్ కెరీర్ బిగినింగ్ లో మాధవన్ టివీ సీరియళ్ళలో చిన్న చిన్న పాత్రలు చేసేవారు.

1996లో జీ టీవీలో బాగా హిట్ అయిన ‘బనేగీ అప్నీ బాత్ ’ సీరియల్ లో మంచి పేరు వచ్చింది.  ఈ సమయంలోనే మణిరత్నం దృష్టిలో పడ్డ మాధవన్ ‘సఖి’ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు.  ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది..వెంటనే తమిళ, హిందీ మూవీస్ లో వరుస ఛాన్సులు దక్కించుకున్నాడు. ఇటీవల అక్కినేని నాగార్జున నటించిన ‘సవ్యసాచి ’ సినిమాలో విలన్ గా నటించాడు మాధవన్. 

మరింత సమాచారం తెలుసుకోండి: