బాలీవుడ్ విలక్షణ నటుడు  మనోజ్ బాజ్ పై  , ప్రియమణి ,గుల్ పనాగ్ , కిషోర్  తదితరులు   ప్రధాన పాత్రల్లో  నటిస్తున్న వెబ్ సిరీస్   ది ఫ్యామిలీ మ్యాన్.  గత కొద్దీ రోజులనుండి ఈ సిరీస్ తొలి సీజన్  అమెజాన్ ప్రైమ్ లో  ప్రసారం అవుతుండగా ఆ ఎపిసోడ్లకు  సూపర్ రెస్పాన్స్ వస్తుంది.  దాంతో  నెటిజన్లు ఈ వెబ్ సిరీస్ ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు.  టెర్రరిస్టుల నుండి దేశాన్ని కాపాడుతూ  తన కుటుంభాన్ని కూడా  సంరక్షించుకున్న ఓ ఎన్ ఐ ఏ ఆఫీసర్  కథతో  ఈవెబ్ సిరీస్  రూపొందుతుంది. ఇందులో ఎన్ ఐ ఏ ఆఫీసర్ గా మనోజ్ బాజ్ ఫై  నటిస్తుండగా అతని భార్యగా ప్రియమణి నటిస్తుంది. 




హిందీలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ఇంగ్లీష్ , తెలుగు, తమిళ భాషల్లో కూడా ప్రసారం అవుతుంది. ముఖ్యంగా స్టోరీ , స్క్రీన్ ప్లే ఈ వెబ్ సిరీస్ విజయంలో  కీలక పాత్రలు పోషిస్తున్నాయి. ఐఎండిబి లో ఈ వెబ్ సిరీస్ 8.9 రేటింగ్స్ ను రాబట్టుకుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో తెలుగు యువ హీరో  సందీప్ కిషన్ కూడా ఓ కీలక పాత్రలో నటించాడు. సందీప్ ఈ వెబ్ సిరీస్ లో మేజర్ విక్రమ్ గా కనిపించనున్నాడు. షోర్ ఇన్ ది సిటీ  ఫేమ్ రాజ్ నిడిమోరు మరియు కృష్ణ డీకే డైరెక్ట్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్  ఈ ఏడాది  వన్  ఆఫ్ ది బెస్ట్ వెబ్ సిరీస్ గా చెప్పొకోవచ్చు. మరి వెబ్ సిరీస్ ప్రేమికులు ఇప్పటివరకు ఈ సిరీస్ ను చూడకుండా  ఉండి ఉంటే ఈ సిరీస్ ఫై లుక్కేయండి.  


మరింత సమాచారం తెలుసుకోండి: