వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర తెగ సందడి చేస్తుంది. గత కొన్ని రోజులుగా బాక్సాఫీసు దగ్గర సినీ సందడి లేకుండా పోయింది. భారీ అంచనాల మధ్య వచ్చిన  సాహో చిత్రం బోల్తా పడటంతో ప్రేక్షకులు మరో సూపర్ హిట్ సినిమా కోసం ఎదురు చూశారు. సరిగ్గా అదే టైమ్ లో గద్దలకొండ గణేష్ అంటూ వరుణ్ వచ్చాడు. పూర్తి మాస్ కథతో వచ్చిన ఈ సినిమాలో వరుణ్ నటన అద్భుతమనే చెప్పాలి. 


గతవారం విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాటు, వరుణ్ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. చిత్రాల వర్గాల సమాచారం ప్రకారం గద్దలకొండ గణేష్ చిత్రం ఆరు రోజులకు గాను వరల్డ్ వైడ్ గా 30కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మేరకు చిత్ర బృందం నిన్న ఓ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. రెండవ వార్ం కూడా ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దుమ్ము దులిపేలా ఉంది


హరీష్ శంకర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. తమిళంలో హిట్ సాధించిన "జిగర్తాండ" కి రీమేక్ గా వచ్చిన ఈ చిత్రంలో తమిళంతో పోలిస్తే చాలా మార్పులు కనబడ్డాయి. అందుకే అనుకుంటా ప్రత్యేకించి "ర్పులు"అనే టైటిల్ కార్డ్ కూడా కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమాకి బాక్సాఫీసు వద్ద ఎదురు లేదనే చెప్పవచ్చు.  ఈ వారం విడుదల అవుతున్న నిన్ను తలచి, రామ చక్కని సీత, మిర్రర్, రాయలసీమ లవ్ స్టోరీ సినిమాలు చిన్న సినిమాలు కావడంతో వాటికి సరైన ప్రమోషన్ లేదు.


అందువల్ల అవి రిలీజ్ అవుతున్నట్టూ కూడా ఎక్కువ మందికి తెలియదు. కాబట్టి ఈ వారం కుడా గద్దల కొండ గణేష్ బాక్సాఫీసును ఏలడం ఖాయమనిపిస్తోంది.  సైరా వచ్చే వరకు గద్దల కొండ గణేష్ ని ఆపే వారే లేరని తెలుస్తుంది. సైరా సినిమా అక్టోబరు  2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాల భాషల్లో విడుదల అవుతుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: