బాలీవుడ్ లో బిగ్ బాస్ షో 12 సీజన్లుగా సక్సెస్ గా రన్ అవుతుంది. తెలుగులో రెండు సీజన్లు కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ ప్రస్తుతం 3వ సీజన్ నడుస్తుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 3లో 10 వారాలు పూర్తిచేసుకుంది. 9 మంది కంటెస్టంట్స్ ఉన్న బిగ్ బాస్ హౌజ్ లో ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అలి రెజా మళ్లీ హౌజ్ లోకి వచ్చాడు. 


అదేంటి అలి ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యాడుగా మళ్లీ అతనెలా హౌజ్ లోకి వస్తాడంటే.. బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో నూతన్ నాయుడు, శ్యామలను ఓటింగ్ ద్వారా రీ ఎంట్రీ ఇప్పించారు. అయితే సీజన్ 3లో అలాంటి ఓటింగ్ ఏమి జరుగలేదు. స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఉన్న అలి రెజా ఎలిమినేట్ అవడమే ఆడియెన్స్ కు షాక్ ఇచ్చింది.


అయితే అలి ఎలిమినేషన్ టైంలో బిగ్ బాస్ పై విమర్శలు వచ్చాయి. విన్నర్ అయ్యే లక్షణాలున్న అలిని ఎలా ఎలిమినేట్ చేస్తారంటూ బిగ్ బాస్ మీద వ్యతిరేకత వచ్చింది. అందుకే మళ్లీ అలిని హౌజ్ లోకి పంపించారు. అలి హౌజ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి ముందు చాలా క్లోజ్ గా ఉన్న వరుణ్, రాహుల్ లు ఓ టాస్క్ లో గొడవ పడ్డారు.  


అలి రెజా ఎలిమినేట్ అవడానికి రాహుల్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. మరి రీ ఎంట్రీ ఇచ్చిన అలి ఎవరిని టార్గెట్ చేస్తాడు..? అసలు ఇప్పుడు అలి గేం ప్లాన్ ఏంటి..? అన్నది ఆసక్తిగా మారింది. ఇంట్లో ఉన్న వాళ్లంతా తనకు సపోర్ట్ గా లేరని ఉన్న శ్రీముఖికి మాత్రం అలి రెజా రీ ఎంట్రీ సంతోషాన్ని తెచ్చిపెట్టింది. మరి రాబోయే రోజుల్లో ఆట ఎలా సాగుతుంది అన్నది మాత్రం ప్రస్తుతానికి చెప్పడం కష్టం. అలి బయటకు వెళ్లొచ్చాడు కాబట్టి విన్నర్ అయ్యే ఛాన్సులు మాత్రం తక్కువనే చెప్పొచ్చు.    



మరింత సమాచారం తెలుసుకోండి: