స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న సినిమా అల వైకుంఠపురములో. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను, పలు కమర్షియల్ అంశాలు మిక్స్ చేసి తెరకెక్కిస్తున్నాడట దర్శకుడు త్రివిక్రమ్. డీజే, నాపేరు సూర్య సినిమాలతో కెరీర్ పరంగా కొంత ఢీలా పడ్డ బన్నీ, ఈ సినిమాతో ఎలాగైనా పెద్ద కొట్టాలని చూస్తున్నాడు. అలానే ఇప్పటివరకు బన్నీ మరియు త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో, 

హ్యాట్రిక్ సినిమాగా రాబోతున్న ఈ అల వైకుంఠపురములో సినిమా తప్పకుండా సక్సెస్ సాధించి, వారిద్దరికీ హ్యాట్రిక్ విజయాలు అందించి తీరుతుందని బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ యాక్ట్రెస్ టబు ఒక ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుండగా, అక్కినేని సుశాంత్, నివేత పేతురాజ్ ఇతర క్యారెక్టర్లలో నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలోని సామజవరగమనా అనే పల్లవితో సాగె ఫస్ట్ సాంగ్ ప్రోమోని నిన్న యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ సాంగ్ గురించి సంగీత దర్శకుడు థమన్, కాసేపటి క్రితం తన అనుభవాలు ప్రేక్షకులతో పంచుకున్నాడు. 

త్రివిక్రమ్ తో తాను పని చేస్తున్న ఈ సినిమా రెండవదని, అలానే బన్నీకి గతంలో సరైనోడు, రేస్ గుర్రం సినిమాలకు సంగీతం అందించానని అన్నారు. అయితే అందరికంటే బన్నీకి సాంగ్స్ కంపోజ్ చేయడం ఒకింత కష్టం అని అన్నారు. ఎక్కువగా యూత్ ఫుల్ ఫీల్ తో పాటు డ్యాన్సింగ్ ఫీల్ ఉన్న సాంగ్స్ ని ఫ్యాన్స్ ఆయన నుండి ఆశిస్తారని, అయితే ఆ విధంగా ఈ సినిమాలో మరికొన్ని సాంగ్స్ ఉన్నప్పటికి, ఈ సామజవరగమనా సాంగ్ మాత్రం మంచి మెలోడీ తో సాగె ఫీల్ గుడ్ సాంగ్ అని అన్నారు థమన్. తప్పకుండా ఈ సాంగ్ అందరికి నచ్చుతుందని, అలానే త్వరలో రిలీజ్ కాబోయే ఈ సినిమాలోని మిగతా పాటలన్ని కూడా మీకు నచ్చుతాయని అంటున్నారు థమన్.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: