తమిళ స్టార్ హీరో  ఇళయదళపతి విజయ్  నటించనున్న 64వ చిత్రంలో  మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి  విలన్ రోల్ లో  నటించడం ఖాయమైంది.    ఇటీవలే ఈ న్యూస్ బయటికి రాగ తాజాగా చిత్ర బృందం  ఆ వార్తలను ధ్రువీకరించింది. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని లోకేష్ కనకరాజ్ డైరెక్ట్ చేయనున్నాడు. యంగ్ కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా  ఎక్స్ బి ప్రొడక్షన్స్  ఈ చిత్రాన్నినిర్మించనుంది. అక్టోబర్  లో ఈ చిత్రం యొక్క షూటింగ్ స్టార్ట్ కానుంది. 



ఈ చిత్రంలో హాట్ బ్యూటీ    మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించనుందని వార్తలు వస్తున్నాయి. మాములుగానే విజయ్ నటించే సినిమాలకు హైప్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు  మరో స్టార్  నటుడు విజయ్ సేతుపతి కూడా జాయిన్ కావడంతో ఈ చిత్రంఫై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 



ఇక విజయ్ ఇటీవలే బిగిల్ అనే చిత్రాన్ని పూర్తి చేశాడు.. అట్లీ డైరెక్షన్ లో  స్పోర్ట్స్  డ్రామా గా తెరకెక్కుతున్న ఈ చిత్రం లో విజయ్  డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నాడు.  భారీ బడ్జెట్ తో  ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్ ఈచిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తుండగా ఏ ఆర్ రహెమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం  తమిళ, తెలుగు భాషల్లో  దీపావళి కానుకగా  విడుదలకానుంది.  తెలుగులో ఈ చిత్రాన్ని మహేష్ కోనేరు విడుదలచేయనున్నాడు. ఇక గత ఏడాది  విజయ్ నటించిన  సర్కార్ తమిళ్ తో పాటు తెలుగులోనూ విజయం సాధించడంతో  బిగిల్ ఫై తెలుగులో కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుటుందో లేదో చూడాలి 


మరింత సమాచారం తెలుసుకోండి: