సినిమా హీరో కోసం రక్తదానం చేసే సంప్రదాయం మెగా ఫాన్స్ తోనే మొదలైంది.కొందరు సినిమా తారలు సైతం మెగా స్టార్ కు వీరాభిమానులు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ రేంజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాంటి క్రేజీ అభిమాని గురించి తీసిన సినిమాయే  'సురభి 70 ఎం.ఎం.లేడీ ఓరియంట్ మూవీ గా వస్తున్నా సురభి 70 ఎం.ఎం. లో చిరు నటించిన సినిమా 'అభిలాష' ఆ అమ్మాయి పేరు, చిరు  సూపర్ హిట్ సినిమా 'గ్యాంగ్ లీడర్' ఆమె క్యారక్టర్. 

ఇక ఈ అమ్మాయి కి మెగా స్టార్ట్ అంటే ఎంత పిచ్చి అంటే.. 'జై చిరంజీవా' అంటూ చేతికి పచ్చ బొట్టు పొడిపించుకునేంత.  'సురభి 70 ఎం.ఎం' అనే ధియేటర్ ను కబ్జా చేసేందుకు ప్రయత్నించే ఓ రౌడీని మెగా ఫ్యాన్ అయిన అభిలాష ఎలా ఏదుర్కొంది? అనేది స్టోరీ.ఈ క్రమంలో ఆ అమ్మాయి గ్యాంగ్ లీడర్ గా ఎలా మారింది?  అనేది ఈ సినిమా స్టోరీ.ఈ చిత్రాన్ని శ్రీ భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి పిక్చర్స్-అద్వైత పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తుండగా యువ ప్రతిభాశాలి వై.గంగాధర్ సొంత నిర్మాణంలో దర్శకత్వం వహిస్తున్నారు.

ఈ సినిమాలో  నటిస్తున్న యువ కథానాయకి అక్షత శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'స్వతహా మెగా స్టార్ కు పెద్ద ఫ్యాన్ అయిన నాకు 'సురభి '70 ఎం.ఎం'లో మెగాభిమానిగా గ్లామర్ తోపాటు నటనకు ప్రాధాన్యత కల 'అభిలాష' అనే పాత్రలో 'లేడి గ్యాంగ్ లీడర్'గా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నది.సురభి 70 ఎంఎం చిత్రం తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని నమ్మకంగా చెప్తుంది ఈ యువ నటి. 

మా బాస్ చిరంజీవి టైటిల్ రోల్ ప్లే చేసిన 'సైరా' సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.. అంటోంది.అక్టోబర్ 2వ  తేదీన విడుదల అవుతున్న సినిమా కోసం ఒక మెగా అభిమానిగా ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాను అని అక్షత శ్రీనివాస్ అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: