అందంతో పాటు  చురుకుదనంతో అటు బుల్లితెర యాంకర్ గా,  ఇటు వెండితెరపై యాక్టర్ గా పాపులారిటీ తెచ్చుకుంది అనసూయ.రాంచరణ్ రంగస్థలంలో  రంగమ్మత్తగా చేసిన
అనసూయకు  స్పెషల్ క్యారెక్టర్స్ వెతుక్కుంటూ వస్తున్నాయి.రంగస్థలం లాంటి భారీ హిట్ తర్వాత కొంత గ్యాప్ తీసుకున్న సుకుమార్.. తన తదుపరి ప్రాజెక్టును స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
 
సుకుమార్ మరో సారి తన కొత్త సినిమాలో అనసూయ కోసం అదిరిపోయే రోల్ సిద్ధం చేశాడని తెలుస్తోంది.స్క్రిప్ట్ పనుల్లో ఉన్నపుడే  తన సినిమాలోని క్యారెక్టర్స్‌‌కి ఎవరెవరు అవసరం, వారి కోసం ఎలాంటి స్క్రిప్ట్ రెడీ చేయాలి? అని లెక్కలేసుకోవడం ఈ క్రియేటివ్ డైరెక్టర్ స్టైల్.ఇందులో భాగం గానే అనసూయ కోసం ఫుల్ లెంగ్త్ రోల్ ఉండేలా ఓ సూపర్బ్ క్యారెక్టర్‌ డిజైన్ చేశారట సుక్కు.
ఈ విషయం అనసూయతో కూడా చెప్పడంతో ఇప్పటినుంచే ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవడం ప్రారంభించిందని తెలుస్తోంది. మరోసారి సుక్కు డైరెక్షన్‌లో తన టాలెంట్ చూపాలని రెడీ అయిపోయింది ఈ హాట్ యాంకర్.

అల్లు అర్జున్ కొత్త సినిమాలో అనసూయ క్యారెక్టర్ సుకుమార్ డిజైన్ చేస్తున్నారంటే అందులో ఖశ్చితంగా  ఏదో క్రియేటివిటీ దాగి ఉంటుందంటున్నారు.సో తమ అభిమాన హీరోతో పాటు రంగమ్మత్త హంగామా వెండితెరపై చేసేయొచ్చని ఇప్పటి నుంచే ఖుషీ అవుతున్నారు బన్నీ అభిమానులు. చూడాలి మరి వచ్చే ఏడాది సెట్స్ పైకి రాబోతున్న ఈ సినిమాలో అనసూయ నటిస్తుందా? లేదా అనేది.ఇక మరో విషయం ఏంటంటే.. ఈ చిత్రంలో రష్మిక మందన్నను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకుంటున్నట్లు టాక్ నడుస్తుంది.
 ఇక ఈ సినిమాను కూడా రంగస్థలం లాగే పల్లెటూరి నేపథ్యంలోనే రూపొందించాలని ఆయన ప్లాన్ చేస్తున్నారట దర్శకుడు సుకుమార్.అంతేకాదు రంగస్థలంలో రామలక్ష్మిగా సమంత ఎలాగైతే అలరించిందో అంతకు మించి రష్మిక అలరించేలా సుక్కు  క్యారక్టర్ డిజైన్ చేస్తున్నాడట.మరి చూడాలి సుక్కు దర్శకత్వంలో రష్మిక, బన్నీ మరియు అనసూయ ఎలాగా ఎంటర్టైన్ చేయబోతున్నారో.


మరింత సమాచారం తెలుసుకోండి: