సినిమాల్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తూ చూస్తుంటారు.కానీ  ఆ సన్నివేశాల్లో నటించే హీరోలు  చాలా రిస్క్ చేసి కష్టపడుతుంటారు. ఒక్కోసారి డూప్స్ తో రిస్కీ షాట్స్ తీయిస్తూ ఉంటారు దర్శకులు.కానీ తమ అభిమానులకు ఏదైనా కొత్తగా చూపించాలని కొందరు హీరోలు రిస్క్ తీసుకుంటూ ఉంటారు.అటువంటి వారిలో బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ ముందుంటాడు.బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్,స్టార్ హీరో  టైగర్ ష్రాఫ్ హీరోలుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ "వార్". 

హై  యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లు విడుదల చేసారు చిత్ర యూనిట్.ఇందులో హృతిక్, టైగర్ స్టంట్స్ చూసిన  ప్రేక్షకులకు  రోమాలు నిక్కపొడుచుకునేలా ఉన్నాయి.వీళ్ళిద్దరు చేసిన రియల్ స్టంట్స్ యాక్షన్ ప్రేమికులకు కనువిందుగా ఉంది ట్రైలర్.దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 
ఇద్దరు ఇండియన్  ఏజెంట్స్ మధ్య జరిగే పోరు నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతుందని ఈ ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది.కాగా ఈ చిత్రంలోని ఓ యాక్షన్ సీన్ ని పోర్చుగల్ లోని పోర్టు బ్రిడ్జి పై చిత్రీకరించడం జరిగింది. 

300అడుగుల ఎతైన ఆ బ్రిడ్జి పై నుండి హృతిక్ ఎటువంటి డూపు లేకుండా దుకారట. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ స్వయంగా తెలియయజేశారు. తన అభిమానులకు ఏదైనా కొత్తగా చూపించాలని ఎప్పుడూ తపించే హృతిక్ ఇలాంటి హీరోలు ఇలా రిస్క్ తీసుకుంటూ ఉంటారు అన్నారు ఆయన.
 
వార్ చిత్రంలో హృతిక్ సరసన  హీరోయిన్ గా వాణి కపూర్ నటిస్తుండగా, విశాల్-శేఖర్, సంచిత్ బల్హార సంగీతం అందిస్తున్నారు.సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని  యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి కానుకగా విడుదల కాబోతుంది.


    మరింత సమాచారం తెలుసుకోండి: