నాచురల్ స్టార్ నానీకు గత కొంతకాలంగా సరైన హిట్ రావట్లేదు. నాని కెరీర్ మొదట్లో అలా మొదలైంది, పిల్ల జమీందార్, ఈగ సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకున్నాడు. కానీ ఈగ సినిమా తరువాత నాని సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. వరుసగా ఆరు ఫ్లాపులు రావటంతో నాని మార్కెట్ కూడా దెబ్బతింది. అలాంటి సమయంలో మారుతి నాని కాంబినేషన్లో వచ్చిన భలే భలే మగాడివోయ్ బ్లాక్ బస్టర్ కావటంతో నాని కెరీర్ గాడిలో పడింది. 
 
ఆ తరువాత నాని నటించిన సినిమాలన్నీ హిట్లు అయ్యాయి. ఎంసీఎ సినిమా వరకు విజయాలు సాధించిన నానీకి కృష్ణార్జున యుధ్ధంతో ఫ్లాపులు మొదలయ్యాయి. నాని డ్యూయెల్ రోల్ లో నటించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది. నాని, నాగార్జున కాంబినేషన్లో వచ్చిన దేవదాస్ సినిమాకు కూడా ఫ్లాప్ టాక్ వచ్చింది. ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. 
 
కొన్ని నెలల క్రితం విడుదలైన నాని నటించిన జెర్సీ సినిమాకు ప్రేక్షకుల నుండి హిట్ టాక్ వచ్చింది. కానీ టాక్ కు తగిన కలెక్షన్లు మాత్రం ఈ సినిమాకు రాలేదు. రెండు వారాల క్రితం విడుదలైన నాని గ్యాంగ్ లీడర్ సినిమాకు  రిలీజ్ రోజు అబవ్ యావరేజ్ టాక్ వచ్చినా కలెక్షన్లు మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలనే మిగిల్చాయి. ఎంసీఎ సినిమా తరువాత నాని నటించిన సినిమాలు ఫలితం విషయంలోను, కలెక్షన్ల విషయంలోను నిరాశనే మిగిల్చాయి. 
 
నాని ఈ మధ్య నటిస్తున్న చిత్రాలు రొటీన్ అయిపోతున్నాయనే విమర్శలు కూడా వస్తున్నాయి. లుక్ విషయంలో కూడా నాని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. కథ, కథనం విషయంలో కూడా నాని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. నాని తరువాత సినిమాలతో ఎట్టి పరిస్థితుల్లోను హిట్ కొట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం నాని ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో V అనే సినిమాలో నటిస్తున్నాడు. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: