స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా సైరా నరసింహ రెడ్డి. ఈ సినిమాని చిరంజీవి సుపుత్రుడు రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ కూడా పూర్తయ్యింది.                  


ఈ సినిమా గాంధీ జయంతి సందర్బంగా అక్టోబర్ 2వ తేదీన విడుదల కానుంది. దీంతో మెగా అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు, జనసేన కార్యకర్తలకు ఒక విషయంలో ఇంతవరుకు క్లారిటీ రాలేదు.            


అదేంటి అని అనుకుంటున్నారా ? అదేనండి పవన్ కళ్యాణ్ అన్న చిరంజీవి కోసం సైరా టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు. వాయిస్ ఓవర్ కొన్ని క్షణాలు అయినా ఆ వాయిస్ కే అభిమానుల నుంచి ఓ రేంజ్ లో రెస్పాన్స్ వచ్చింది. దీంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సైరాలో వాయిస్ ఓవర్ మాత్రమేనా లేక నటించారా ? అని అడుగుతున్నారు.                             

 

కాగా ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే .. పవన్ కళ్యాణ్ సినిమాలో నటించారని అయితే అభిమానులకు సర్ప్రైజ్ ఇవ్వడానికి ఆ పాత్రకు సంబంధించిన విషయాలు గోప్యాంగా ఉంచారని అంటున్నారు. మరి నిజంగా పవన్ నటించాడా ? లేక ఇది గాసిప్ ఆ అనేది తెలియాల్సి ఉంది.                              


మరింత సమాచారం తెలుసుకోండి: