''నా కెరీర్‌ స్టార్టింగ్‌ బాగానే ఉన్నా మధ్యలో కొన్ని సినిమాలు నిరాశ పరిచాయి. ఇక లైఫ్‌ అంటే కష్టాలు కామనే కదా. సో! జరిగిన దాని గురించి లైట్‌ తీసుకొని జరగబోయేది ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకున్నాను'' అనిమెహ్రీన్‌ తెలియజేస్తుంది. ఆమధ్య 'ఎఫ్‌2' చిత్రంలో హనీగా అలరించిన ఇప్పుడు 'చాణక్య'లో ఐశ్వర్యగా వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతుంది. గోపీచంద్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్‌ 5న విడుదలవుతున్న సందర్భంగా మెహ్రీన్‌ చిత్ర విశేషాలు తెలియజేసింది.


- 'చాణక్య' స్పై థ్రిల్లర్‌ మూవీ. సినిమాలో నేను ఐశ్వర్య అనే క్యారెక్టర్‌ ప్లే చేశాను. నా క్యారెక్టర్‌లో ట్విస్టులుండవు. హీరో క్యారెక్టర్‌కి ఓ ట్విస్ట్‌ ఉంటుంది. అదేంటనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


-  ఈ సినిమాలో కమెడియన్స్‌ అలీ, సునీల్‌ తో నటించాను. వాళ్ళిద్దరి కామెడీ షూటింగ్‌ టైంలో బాగా ఎంజాయ్‌ చేసాను. వాళ్ళ క్యారెక్టర్స్‌, అలాగే నా క్యారెక్టర్‌లో ఫన్‌ ఉంటుంది. అది అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తుంది.


- నిజానికి స్పై థ్రిల్లర్‌ సినిమాను డైరెక్ట్‌ చేయడం చాలా కష్టం. ఆడియన్స్‌ను ఎప్పటికప్పుడు థ్రిల్‌ చేస్తూ ఎంగేజ్‌ చేయగలగాలి. ఆ విషయంలో డైరెక్టర్‌ తిరుకి మంచి మార్కులు పడతాయి. ప్రతీ సన్నివేశాన్ని ఎంతో క్లారిటీతో తెరకెక్కించారు. కథపై ఆయనకున్న క్లారిటీతోనే సినిమా బాగా వచ్చింది.

షూటింగ్‌ టైంలో కూడా ఆయనకేం కావాలో తెలుసు కనుక మా దగ్గర నుండి పర్ఫెక్ట్‌ అవుట్‌ పుట్‌ తీసుకున్నారు. ఎక్కడా టైం వేస్ట్‌ చేయలేదు.
- గోపీచంద్‌తో ఇది సెకండ్‌ ఫిలిం. 'పంతం' సినిమా తర్వాత మళ్ళీ ఆయనతో వర్క్‌ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సెట్లో ఆయన నుండి చాలా నేర్చుకున్నాను. షూటింగ్‌ అయ్యాక చాలా సైటెంట్‌ ఉంటారు. పక్కన కూర్చొని ఆయన పని ఆయన చేసుకుంటారు. సినిమాలో రామకృష్ణ, విజయ్‌గా అందరినీ మెప్పిస్తారు.


- స్పై థ్రిల్లర్‌ సినిమా అని కేవలం థ్రిల్లింగ్‌ ఎలిమెంట్సే కాదు అన్ని రసాలు ఉంటాయి. రొమాన్స్‌, యాక్షన్‌ ఇలా అన్నీ ఉంటాయి. ఇదొక పవర్‌ పాక్డ్‌ స్పై థ్రిల్లర్‌ అని చెప్పొచ్చు.


-  అనిల్‌గారి ప్రొడక్షన్‌లో మళ్ళీ నటించడం హ్యాపీ గా ఉంది. 14 రీల్స్‌ లోనే మొదటి సినిమా స‌కృష్ణ‌ గాడి వీర ప్రేమ గాధ' చేశాను. మళ్ళీ ఇప్పుడు నా 11వ సినిమా అనీల్‌గారి బ్యానర్‌లో చేయడం ఆనందంగా అనిపించింది. అనీల్‌ మంచి అభిరుచి గల నిర్మాత. ఈ సినిమాతో ఆయన మంచి విజయం అందుకోవాలని కోరుకుంటున్నాను.


- 'ఎఫ్‌2'లో హనీ క్యారెక్టర్‌ బాగా క్లిక్‌ అయింది. ఎక్కడికెళ్ళినా హనీ అనే పిలుస్తున్నారు. అందులో నా మేనరిజం కూడా అందరినీ ఆకట్టుకుంది. ఆ సినిమాకు సంబంధించి నా క్యారెక్టర్‌ క్లిక్‌ అవ్వడానికి కారణం డైరెక్టర్‌ అనీల్‌ గారే.


- డ్రీమ్‌ రోల్స్‌ అనేవి పెద్దగా లేవుకానీ.. 'ఓబేబీ'లో సమంత, 'బాహుబలి'లో అనుష్క చేసిన తరహా పాత్రలు చేయాలనే ఆలోచన వుంది. అంత ప్రాధాన్యత వున్న పాత్రలు కూడా నేను చేయగలను.


- హీరోయిన్‌గా ఎన్ని భాషల్లో సినిమా చేసినా నా మొదటి ప్రాముఖ్యత మాత్రం తెలుగుకే. తెలుగు సినిమా అంటే నాకు అమ్మతో సమానం. ఎంత బిజీ అయినా తెలుగు సినిమాను వదులుకోను. ప్రస్తుతానికి నా ఫోకస్‌ తెలుగు సినిమాలే.


 - ప్రస్తుతం తెలుగులో 'ఎంత మంచి వాడవురా', 'అశ్వద్దామ' సినిమాలు చేస్తున్నాను. పంజాబీలో నా మొదటి సినిమా రిలీజ్‌ కి రెడీగా ఉంది. అది కాకుండా ఇంకో సినిమా చేస్తున్నాను.


మరింత సమాచారం తెలుసుకోండి: