2010లో మొదలైన 'హౌస్‌ ఫుల్‌' మూవీ సిరీస్‌లో భాగంగా తెరకెక్కిన 'హౌస్‌ ఫుల్‌ 4' చిత్ర ట్రైలర్‌ శుక్రవారం విడుదల చేశారు. మూడు ప్రేమ జంటల మధ్య రెండు భిన్న కాలాలలో జరిగే గజిబిజి గందర గోళంమే హౌస్‌ ఫుల్‌4 చిత్రం అని అర్థం అవుతుంది. హౌస్‌ ఫుల్‌ సక్సెస్‌ సిరీస్‌లో కామెడీ రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌, కృతి సనన్‌, రితేష్‌ దేశముఖ్‌, బాబీ డియోల్‌, కృతి కర్బంద, పూజ హెగ్డే నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో రానా కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. ట్రైలర్‌ లో ఆయన లుక్‌ చూసిన ఎవరైనా ఆశ్చర్య పోవాల్సిందే. హాలీవుడ్‌ సినిమాలలో భారీ రాక్షసులను పోలిన లుక్‌లో ఉన్న రానా ఆసక్తిగొలుపుతున్నారు. రాజుల కాలంలో జైన్ట్‌ మోన్స్టర్‌ పాత్ర రానా చేశారు. ఫర్హాద్‌ సామ్జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్‌ స్టార్‌ ఫిలిమ్స్‌, మరియు సాజిద్‌ నడియావాలా గ్రాండ్‌ సన్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ఏడాది దీపావళి కానుకగా విడుదల కానుంది.


ఈ చిత్రం షూటింగ్ ముంబైలోని స్టూడియోలో జరిగింది. షూటింగ్ సమయంలో పూజా హెగ్డేకు జలుబు, దగ్గు సమస్యలు బాధించాయి. అయితే పూజా హెగ్డే తన సమస్యను ఏ మాత్రం లెక్కచేయకుండా మందులు వాడుతూ షెడ్యూల్ ప్రకారం అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి చేసింది. జలుబు, దగ్గు ఉన్నా సినిమా ఆలస్యమవకూడదని భావించి..షూటింగ్ లో పాల్గొన్న పూజా హెగ్డేకు హౌస్ ఫుల్ టీం ఫిదా అయిపోయింది.


1419, 2017 ల మధ్య కాలంలో సాగే కథాంశంతో వినోదాత్మకంగా సినిమాను రూపొందించారు.బ‌రానా దగ్గుబాటి విలన్ పాత్రలో భయపెట్టాడనే చెప్పారు. కథలో అక్షయ్ కి తన పునర్జన్మ గుర్తొస్తుంది. కానీ ఆయనతో పాటు ఉన్న రితేష్, బాబీ, పూజా, కృతి కర్భందా, కృతి సనన్, పూజ హెగ్డేలకు మాత్రం గుర్తురాదు. వారికి గత జన్మ గుర్తు చేయడానికి అక్షయ్ నానా తంటాలు పడుతుంటాడు. ఆ తరువాత ఏం జరుగుతుందనేదే సినిమా. 


మరింత సమాచారం తెలుసుకోండి: