నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిత్రం షూటింగ్‌ మొదలై కొంత భాగం పూర్తి చేసుకొంది. అయితే సినిమాకి సంబంధించిన టీజర్‌ను దసరా పండుగ నాడు విడుదల చేయనున్నారని సమాచారం. ఆ మధ్య ఈ సినిమాకి సంబంధించిన  పోస్టర్లు కొన్ని విడుదలైయ్యాయి. అందులో బాలకృష్ణ చాలా స్టయిలీష్‌గా కనిపిస్తున్నారు. అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే విదేశాల్లో సినిమా షూటింగ్‌ జరుపుకుంది. తాజాగా సినిమాకి సంబంధించిన మరో షెడ్యూల్‌ ఖరారు చేశారట. ఈ షెడ్యూల్‌ అక్టోబర్‌ మొదటివారంలోనే హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో తీయనున్నారు. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపించనున్నార‌ని తెలుస్తోంది. సినిమాకి 'రూలర్‌' అనే పేరును పరిశీలిస్తున్నట్లు దసరాకు వెల్లడించనున్నట్లు సమాచారం. కథానాయికలుగా సోనాల్‌ చౌహాన్‌, వేదిక నటిస్తున్నారు. ఇందులో భూమిక చావ్లా, ప్రకాష్‌ రాజ్‌, జయసుధలు తదితర నటీనటులు నటిస్తున్నారు. హ్యాపీ మూవీస్‌ పతాకంపై నిర్మితమౌతున్న ఈ సినిమాకి సి.కల్యాణ్‌ నిర్మాతగా వ్యవహరిస్తుండగా చిరంతన్‌ భట్‌ సంగీతం అందిస్తున్నారు.
ఇటీవ‌ల థాయ్‌లాండ్‌లో తొలి షెడ్యూల్ పూర్త‌య్యింది. సెప్టెంబ‌ర్ 5 నుండి హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో లెంగ్తీ షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుంది. బాల‌కృష్ణ రెండు డిఫ‌రెంట్ లుక్స్‌లో క‌న‌ప‌డతారు. ఇటీవ‌ల విడుద‌లైన ఓ లుక్‌కి ప్రేక్ష‌కుల నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది. సోనాల్‌ చౌహాన్‌, వేదిక హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


అటు బోయపాటి శ్రీను కూడా బాలకృష్ణ ఇచ్చిన సూచనల మేరకు స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే వీరిద్దరి కలయికలో సినిమా ఎప్పుడు ఉంటుందో క్లారిటీ ఇప్పట్లో వచ్చేలా కనిపించడం లేదని వార్తలు వస్తున్నాయి. హై బడ్జెట్ కారణంగా పోస్ట్‌పోన్ అయిన ఈ సినిమాకి ఇప్పుడు బడ్జెట్ కుదించినా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి.


మరోవైపు బోయపాటి లేటెస్ట్‌గా మార్చిన స్క్రిప్ట్ బాలయ్యకు బాగా నచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారని.. అందులో ఒక పాత్ర కొంత వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. మరి సినిమా ఎప్పుడు మొదలవుతుందో.. వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ హిట్ వస్తుందా అనేది వేచి చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: