టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో వరుస విజయాలు అందుకున్న సూపర్ స్టార్, ప్రస్తుతం చేస్తున్న ఈ సినిమాతో మరొక హిట్ కొట్టి, హ్యాట్రిక్ విజయాలు తన ఖాతాలో వేసుకోవాలని ఎంతో కసిగా వర్క్ చేస్తున్నట్లు సమాచారం. ఇకపోతే మహేష్ బాబు కెరీర్ పరంగా ఇప్పటివరకు ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించినప్పటికీ, ఇప్పటివరకు ఆయన ఫుల్ లెంగ్త్ లవ్ స్టోరీ కానీ, ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా కానీ చేయకపోవడం ఇప్పటికీ కూడా ఆయన ఫ్యాన్స్ లో అది ఒక తీరని కోరికగా మిగిలిపోయింది అనే చెప్పాలి. 

అయితే కేవలం సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, ఎందరో ప్రేక్షకులు కూడా మహేష్ ను ఆ విధమైన సినిమాల్లో చూడాలని ఎప్పటినుండో ఆశపడుతున్నారు. అయితే ప్రస్తత పరిస్థితుల్లో మహేష్, ఒక మంచి లవ్ స్టోరీ లో ఎంతవరకు నటిస్తారు, దానికి ఎవరు దర్శకత్వం వహిస్తారు అనేది కొంత చెప్పలేనప్పటికీ, మహేష్ బాబుతో ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో హరీష్ శంకర్ మాత్రం ఒక మంచి మాస్ సినిమా చేస్తే, అది తప్పకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని అంటున్నారు ఆయన ఫ్యాన్స్, మరియు ప్రేక్షకులు. గతంలో పవర్ స్టార్ కు గబ్బర్ సింగ్ సినిమాతో ఎప్పటికీ గుర్తుండిపోయే సూపర్ డూపర్ హిట్ ని అందించిన హరీష్, 

ఇటీవల సాయి ధరమ్ తేజ్ తో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, అలానే ప్రస్తుతం వరుణ్ తేజ్ కు గద్దలకొండ గణేష్ వంటి మాస్ సినిమాలు ఇచ్చారని గుర్తు చేస్తున్నారు  ప్రస్తుతం మహేష్ క్లాస్ మరియు మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా చేస్తుండడంతో, ఈ సమయంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో ఆయన ఊర మాస్ సినిమా ఒకటి చేసినట్లయితే అది తప్పకుండా ఇండస్ట్రీ హిట్ కొట్టడం ఖాయమని వారు అంటున్నారు. అయితే మహేష్ బాబు, హరీష్ శంకర్ కు ఎంతవరకు అవకాశం ఇస్తారు అనేది మాత్రం ఆలోచించాల్సిన విషయం. మరి మన సూపర్ స్టార్, తన ఫ్యాన్స్ కోరిక  మేరకు ఇకనైనా మంచి మాస్ సినిమాలో నటిస్తారో లేదో చూడాలి,,,,,!!


మరింత సమాచారం తెలుసుకోండి: